దక్షిణాది విలన్ గా మరో బాలీవుడ్ నటుడు?

తాజాగా బాలీవుడ్లో వయసైపోయిన హీరోలు దక్షిణాది సినిమాల్లో విలన్ గా కనిపిస్తున్నారు. అనుభవంతో పాటు కాస్త ఇమేజ్ కూడా ఉండడంతో పారితోషకాన్ని వెనుకాడకుండా ఇక్కడ నిర్మాతలు వారిని సినిమాల్లో పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం దక్షిణాది సినిమాల మార్కెట్ పెరగడం, ఇక్కడ సినిమా బడ్జెట్ బాలీవుడ్ స్థాయిని సైతం మించడంతో ఇక్కడికి తరలి వస్తున్నారు అక్కడి తారలు.

ఈ నేపధ్యంలో అక్షయ్ కుమార్ 2.0 లో ప్రతి నాయకుడిగా కనిపించారు. ఇప్పుడు అనిల్ కపూర్ వంతు వచ్చింది. ఆయన శంకర్-కమల్ హాసన్ ‘ఇండియన్ 2 ‘ లో ప్రతి నాయక పాత్ర కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందుకోసం అనిల్ ప్రస్తుతం చెన్నై లో శంకర్ తో చర్చలు జరుపుతున్నారు. మరి అనిల్ ఒప్పుకుంటాడా లేదా అన్నది దర్శక నిర్మాతలు చెబుతారు.