తెలుగు పరిశ్రమలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న ఈ భామకు తెలుగునాట క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. పెద్ద హీరో చిత్రం ఏది మొదలైనా ముందుగా పూజా హెగ్డే పేరే పరిశీలనలో ఉంటోంది. హీరోలకంటే ముందు స్టార్ డైరెక్టర్లు పూజా హెగ్డే పేరును సజెస్ట్ చేస్తుండటం విశేషం. అందుకే ఈ డస్కీ బ్యూటీకి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ సరసన ‘ఆచార్య’, ప్రభాస్ జోడీగా ‘రాధేశ్యామ్’, అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాలు చేసిన పూజా విజయ్, వంశీ పైడిపల్లి ప్రాజెక్టును దక్కించుకుంది.
ఇవి రెండూ కాకుండా ఇంకో మూడు కొత్త సినిమాలు పూజా హెగ్డే ఖాతాలోకి వచ్చి చేరాయి. అవి మూడు మూడు సాదాసీదా సినిమాలు కాదు. భారీ బడ్జెట్ చిత్రాలే. వాటిలో ఒకటి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా కాగా రెండవది మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే సినిమా. ఇక మూడవది శేఖర్ కమ్ముల, ధనుష్ చేయనున్న చిత్రం. పూజా హెగ్డే ఒక్కొక సినిమాకు దగ్గర దగ్గర రెండున్నర నుండి మూడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ పుచ్చుకుంటోంది. ఇంత హెవీ అమౌంట్ అడుగుతున్నా కూడ దర్శక నిర్మాతలు ఆమెనే కోరుకుంటుండటం విశేషం. సౌత్ ఇండస్ట్రీలో హాట్ కేక్ అయిన పూజా హెగ్డే హవా ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించట్లేదు.