రామ్ చరణ్ చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిందేనా ?

Ram Charan should do another project before Shankar movie
Ram Charan should do another project before Shankar movie
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్లానింగ్ వేరేలా ఉంది.  ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేయాలని, ఏడాదికి కనీసం ఒక సినిమాతో అయినా రావాలని చూస్తున్నాడు.  అందుకే శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పాడు.  ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ఒప్పుకున్న ఏకైక సినిమా ఇదే.  రాజమౌళి సినిమా నుండి బయటకు రాగానే శంకర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నాడు.  శంకట్ సినిమా అంటే బోలెడంత టైమ్ ఇవ్వాల్సి ఉంటుంది.  వేరే సినిమాలు పెట్టుకుంటే అస్సలు కుదరదు.  అందుకే చరణ్ వేరే ఎవ్వరికీ డేట్స్ ఇవ్వలేదు.  ఇప్పుడు చూస్తే ఇదే పెద్ద ఇబ్బంది అయ్యేలా ఉంది ఆయనకు. 
 
ఎందుకంటే రామ్ చరణ్ ఖాళీ అయిన వెంటనే శంకర్ సినిమా మొదలుపెట్టే పరిస్థితి లేదు.  ఇంకా సగం బాకీ ఉన్న ‘ఇండియన్ -2’ కంప్లీట్ చేసేవరకు లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు ఆయన్ను వదిలేలా లేరు.  ఆ సినిమా సెప్టెంబర్ నెలకు గాని సెట్స్ మీదకు వెళ్లేలా లేదు.  ఒకవేళ ఈలోపు కమల్ హాసన్ వేరొక సినిమాకు కమిట్ అయితే ఇంకా ఆలస్యం కావొచ్చు.  మొదలయ్యాక పూర్తికావడానికి కనీసం మూడు నుండి నాలుగు నెలలు పడుతుంది.  అంటే వచ్చే ఏడాదిలోనే శంకర్ ఫ్రీ అయి చరణ్ సినిమా మీదకు రాగలరు.  
 
చరణ్ గనుక ‘ఆర్ఆర్ఆర్’తర్వాత శంకర్ సినిమానే చేయాలని అనుకుంటే మాత్రం ఐదారు నెలలు ఖాళీగా ఉండాల్సిందే. ఒక స్టార్ హీరో ఐదారు నెలలు ఖాళీగా ఉండటం అంటే చేతులారా ఒక సినిమాను కోల్పోయినట్టే. కాబట్టి చరణ్ మంచి స్పీడున్న దర్శకుడ్ని పట్టుకుని శంకర్ ‘ఇండియన్ -2’ నుండి బయటకు వచ్చేలోపు ఒక సినిమాను చేసుకుంటే బెటర్.  లేదంటే ఐదారు నెలలు చేతుకు ముడుచుకుని ఖాళీగా ఉండాల్సిందే.