తేజ బర్త్‌డేకు డ‌బుల్ ధ‌మాకా ఇచ్చాడు!

కెరీర్ తొలి నాళ్ల‌లో ద‌ర్శ‌కుడిగా సంచ‌ల‌నం సృష్టించిన తేజ జోరు ఇటీవ‌ల బాగా త‌గ్గిపోయింది. వ‌రుస ఫ్లాపులు.. నిర్మాత‌ల‌తో వివాదాలు.. ఇక సినిమాలు ఆపేయాలేమో అనే స‌మ‌యంలోనే రానాతో `నేనే రాజు నేనే మంత్రి` హిట్‌తో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. నేడు (శ‌నివారం). ఇటీవ‌ల `సీత‌` సినిమాతో డిజాస్ట‌ర్‌ని చ‌విచూసిన తేజ మ‌ళ్లీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవాల‌ని ఒకే సారి రెండు చిత్రాల్ని ప్లాన్ చేస్తున్నాడు.

`జ‌యం` సినిమాతో గోపీచంద్‌ని విల‌న్‌గా ప్ర‌జెంట్ చేసిన తేజ ఆ త‌రువాత అత‌న్ని హీరోగా పెట్టి ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. ఇన్నాళ్ల‌కు తొలిసారి ఆ ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నాడు. గోపీచంద్ హీరోగా `అలిమేలు మంగ వేంక‌ట‌ర‌మ‌ణ‌` పేరుతో ఓ సినిమాకు శ్రీ‌కారం చుడుతున్నాడు. దీనితో పాటు త‌న‌కు `నేనే రాజు నేనే మంత్రి` వంటి హిట్ చిత్రాన్నిచ్చిన రానాతో `రాక్ష‌స రాజు రావ‌ణాసుడు` పేరుతో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ రెండు చిత్రాల‌కు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తయింది. త్వ‌ర‌లోనే ఏది ముందు మొద‌లుపెట్ట‌బోతున్నాడో క్లారిటీ వ‌చ్చేస్తుంది.