తెర పైకి మళ్ళీ రియల్ తండ్రీకొడుకులు

ఆ మధ్య ‘మనం’ సినిమాతో ఏకంగా కుటుంబమంతా కలిసి కనిపించారు అక్కినేని వారు. ఆ సినిమా ఎంత విజయవంతం అయిందో చెప్పేదేముంది. ఆ తరువాత మళ్ళీ రియల్ తండ్రీకొడుకులు నాగార్జున-నాగ చైతన్య మళ్ళీ తెర పై కనిపించలేదు. ఇదుగో మళ్ళీ ఇప్పటికి ముహూర్తం కుదిరింది.

నాగ చైతన్య నటిస్తున్న ‘బంగార్రాజు’ సినిమా ‘సోగ్గాడే..’ సినిమా కి సీక్వెల్ గా రూపొందుతోంది. ఈ సినిమాలో నాగ చైతన్య కి తండ్రిగా మళ్ళీ నాగార్జున కనిపించబోతున్నారు. ఈ సినిమాలో చైతు కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ‘సోగ్గాడే..’సినిమా ను తీసిన కళ్యాణ్ ఈ చిత్రానికి దర్శకుడు.