జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా జాక్‌పాట్. పూర్తిస్థాయి హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్గా జాక్‌పాట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కళ్యాణ్. జ్యోతికకు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. ఇది వరకు ఆమె ఇక్కడ చాలా సినిమాల్లో కూడా నటించారు.
పెళ్లి తర్వాత కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్న జ్యోతిక ఇప్పుడు మళ్లీ జాక్‌పాట్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇందులో జ్యోతిక, రేవతి కాంబినేషన్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.
యోగి బాబు, ఆనంద్ రాజ్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే తెలుగులో కూడా భారీ వేడుక ఒకటి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తో పాటు ఆడియో ని విడుదల చేశారు. సూర్య చేతుల మీదుగా ఈ ఆడియో విడుదల అయింది.