విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్
. ఫైట్ ఫర్ వాట్ యు లవ్
ట్యాగ్ లైన్`. భరత్ కమ్మ దర్శకుడు. ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జూలై 11న విడుదల చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. జస్టిన్ ప్రభాకర్ సంగీత సారథ్యంలో ఇప్పటి వరకు విడుదలైన పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి
రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 26న విడుదలవుతుంది.
నటీనటులు:
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తదితరులుసాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్ కమ్మ
మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
డైలాగ్స్: జె కృష్ణ