చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సై రా’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సై రా’ షూటింగ్ మొత్తం పాచ్ వర్క్ తో సహా పూర్తి అయింది. ఇప్పటికే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి అలాగే చిరు తన పాత్రకు డబ్బింగ్ కూడా మొదలు పెట్టారు. ఈ సినిమాలో ప్రధానంగా నిలిచే గ్రాఫిక్స్ పనులు ఒక పెద్ద విదేశీ కంపెనీ కి అప్పగించగా అవి చాలా బాగా వచ్చినట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి  కెమెరామెన్ గా పని చేసిన రత్నవేలు కూడా ఇదే మాట చెప్పారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు మొదలైన పేరు పొందిన నటులు ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.