గాయ‌ని స‌్మిత‌ ఆస్ట్రాల‌జీ వివాదం కాదుక‌ద‌!

మంచి చెబితే చెడు జ‌రిగే రోజులివి. జ‌నానికి మంచి చేయాల‌ని ప్ర‌య‌త్నించినా ఆ విష‌యంలో ఆచి తూచి వ్యంహ‌రించాల్సి వుంటుంది. మ‌న‌కు తెలుసుక‌దా అని జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా చెబితే అది మొద‌టికే మోసం అయ్యే అవ‌కాశాలే ప్ర‌స్తుతం ఎక్కువ‌. అలాంటి ప్ర‌మాదాన్ని దృష్టిలో పెట్టుకుని సెల‌బ్రిటీలు, సామాన్యులు మ‌స‌లు కోవాల్సిన స‌మ‌యం ఇది.

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచంతో పాటు దేశాన్ని వ‌ణికిస్తోంది. దీంతో సెల‌బ్రిటీలంతా జ‌నాన్ని అవేర్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఎవ‌రికి తోచిన దారిలో వారు జ‌నాన్ని క‌రోనా బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు చెతున్నారు. 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిపిందే. మ‌రో రెండు వారాలైతే ఆగ‌డువు పూర్తి కాబోతోంది. ఈ నేప‌థ్యంలో గాయ‌ని స్మిత రిలీజ్ చేసిన వీడియో ఆక‌ట్టుకుంటూనే అనుమానాన్ని క‌లిగిస్తోంది.

రానున్న రెండు వారాలు మ‌న‌కు అత్యంత క్లిష్ట‌మైన‌వి. వ‌చ్చే వారం మ‌రీ క్లిష్టం. ఈ స‌మ‌యంలో ఆస్ట్రాల‌జీ ప్ర‌కారం చంద్రుడి మీద‌కు రాహువు వ‌చ్చేస్తున్నాడు. శ‌ని, అంగార‌కుడు, గురు గ్రహాలు.. ఈ మూడూ ఒకేసారి క‌ల‌వ‌బోతున్నాయి. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌రం. కాబ‌ట్టి అంతా జాగ్ర‌త్త‌గా వుండాల‌ని, ఈ సోమ‌వారం రాత్రి నుంచి ఏప్రిల్ 2 వ‌ర‌కు ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్ద‌ని సూచించింది. అంతా బ‌గానే వుంది కానీ ఆస్ట్రాల‌జీ పేరుతో అనుమానాల్ని రేకెత్తించ‌డ‌మే బాగాలేద‌ని అంటున్నారు. గాయ‌ని స్మిత మంచికి చెప్పిన జాగ్ర‌త్త ఎటు దారి తీస్తుందో చూడాలి.