క్రేన్ ఘ‌ట‌న‌పై శంక‌ర్ షాకింగ్ ట్వీట్‌!

`ఇండియ‌న్‌-2` సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా 150 అడుగుల ఎత్తునుంచి లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ విరిగిప‌డ‌టంతో ఘోర ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు సిబ్బంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. చెన్నై పోలీసులు ఇప్ప‌టికే ఈ ఉదంతంపై ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. త్వ‌ర‌లో హీరో క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు శంక‌ర్‌ని కూడా ప్ర‌శ్పించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ బుధ‌వారం ఈ సంఘ‌ట‌న‌పై మౌనం వీడారు.

భావోద్వేగానికి లోన‌య్యారు. ఆ క్రేన్ త‌న‌పైన ప‌డినా బాగుండేద‌ని అత్యంత బాధ‌త‌ప్త హృద‌యంతో స్పందిస్తున్నాన‌ని, ఆ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్ప‌టి నుంచి తీవ్ర షాక్ కు గుర‌య్యాన‌ని, నిద్ర‌లేని రాత్రుల్ని గ‌డుపుతున్నాన‌ని ఉద్వేగానికి లోన‌య్య‌రు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ని, ఇత‌ర సిబ్బందిన కోల్పోవ‌డం చాలా బాధ‌గా వుంద‌న్నారు. ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నాన‌ని, ఆ క్రేన్ వారిపై కాకుండా త‌నపై ప‌డినా బాగుండేద‌న్నారు. బాధిత కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాన‌ని, వారి కుటుంబాల‌కు ఆ భ‌గ‌వంతుడి అండ వుండాల‌ని ప్రార్థిస్తున్నాను అన్నారు.

అయితే శంక‌ర్ ట్వీట్‌ని చూసిన వారంతా మీరే ఇలా అధైర్య‌ప‌డితే ఎలా స‌ర్‌. ధైర్యంగా వుండండి. మీ బాధ‌ను అర్థం చేసుకున్నాం, ఈ సంఘ‌ట‌న నుంచి మీరు త్వ‌ర‌గా కోలు కోవాల‌ని, ఆ షాక్ నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలని, మ‌ళ్లీ సినిమా మొద‌లుపెట్టాల‌ని కోరుకుంటున్నాం. అని నెటిజ‌న్స్ కామెంట్‌లు చేస్తున్నారు.