క్యాన్సర్ వ్యాధిని జయించిన ఇండియన్ సెలెబ్రిటీలు వీరే


క్యాన్సర్ బారిన పడ్డాను అంటూ ట్వీట్ పెట్టి అందరితో కన్నీరు పెట్టించింది సినీ నటి సోనాలి బింద్రే. సినీ తారలు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని రీట్వీట్స్ పెడుతూ ఉన్నారు. అయితే ఆమెకు క్యాన్సర్ చివరి దశలో ఉందని కోలుకోవడం కష్టమేనని డాక్టర్లు చెబుతున్నారు. సోనాలి మాత్రం మీరు ఇస్తున్న మనోధైర్యంతో ఈ వ్యాధి నుండి బయటపడగలను అనే నమ్మకం నాకు ఉంది. అదే దృఢనిశ్చయంతో పోరాడుతున్నా అంటూ తాను కోలుకోవాలని కోరుకుంటున్న తారలను, అభిమానులను, సన్నిహితులను ఉద్దేశించి ట్విట్టర్ లో పోస్టులు పెడుతోంది. సోనాలీనే కాదు బ్రతకాలి అన్న ఆశ, మానసిక బలం ఉన్న ఎంతోమంది తారలు కాన్సర్ బారిన పడి కూడా జయించారు. అలాంటి సెలబ్రిటీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మనీషా కొయిరాలా:
ఓవరీస్ క్యాన్సర్ బారిన పడి, చావు చివరి అంచుల వరకు వెళ్ళింది మనీషా. మూడేళ్ళ పోరాటం తర్వాత ఆ మహమ్మారిని పూర్తిగా వదిలించుకుని ఇప్పుడు క్యాన్సర్ పై పోరాటానికి స్ఫూర్తిగా నిలుచుంది.

గౌతమి:
దక్షిణాది తార బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడి గెలిచింది. ఆమెలా వ్యాధితో పోరాడే వారికి ప్రేరణ ఇస్తోంది. దేశ విదేశాల్లో నిర్వహిస్తున్న క్యాన్సర్ అవగాహన సదస్సుల్లో పాల్గొంటుంది. ఈ వ్యాధి నుండి బయటపడాలంటే మనోబలం చాలా అవసరం. అందుకు ఆప్తుల మద్దతు ఉండాలి అంటారామె.

మమతా మోహ‌న్‌దాస్:
సుమారు ఎనిమిదేళ్ల క్రితం హడ్జికిన్స్ లింఫోమా క్యాన్సర్ బారిన పడింది ఈ నటి. అప్పటి నుండి చికిత్స కొనసాగిస్తూనే వ్యాధితో పోరాడుతుంది. పూర్తిగా కోలుకోకపోయిన దాని తీవ్ర ప్రభావం నుండి అయితే బయటపడగలిగింది.

ఇర్ఫాన్ ఖాన్:
ఈ బాలీవుడ్ నటుడు తన ఆరోగ్యంపై వచ్చిన ఎన్నో వదంతులకు తెర దించుతూ మర్చి 16 న తనకు న్యూరాన్ డోక్రైమ్ ట్యూమర్ ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం లండన్ లో చికిత్స పొందుతున్నారు.

సోనియా గాంధీ:
2011 నుండి గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కి న్యూయార్క్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సోనియా గాంధీ. తాను క్యాన్సర్ బాధితురాలిలా ఎక్కడా అనిపించకుండా చెరగని చిరునవ్వుతో రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు.

యువరాజ్ సింగ్:
భారత క్రికెట్ ఆల్ రౌండర్ కూడా క్యాన్సర్ ను జయించినవాడే. అంతే కాదు ఎంతోమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు తనవంతు డబ్బు సహాయం కూడా అందిస్తున్నాడు.