వైఎస్ షర్మిలకి సోనియా గాంధీ మాటే వేద వాక్కు.!

ఇంతలోనే ఎంత మార్పు.? ‘కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది. కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు అధికారం అందించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అధినాయకత్వం..’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు గతంలో వైఎస్ షర్మిల.

కానీ, ఇప్పుడు వైఎస్ షర్మిల మాటలు అందుకు పూర్తి భిన్నంగా వున్నాయి. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు సీబీఐ చార్జి షీట్లలో రావడం వెనుక మా ప్రమేయం లేదు..’ అని సోనియా గాందీ చెప్పేశారట, అది వైఎస్ షర్మిల నమ్మేశారట.

‘నా భర్త పేరు ఆయన మరణం తర్వాత సీబీఐ ఛార్జి షీట్లలో పెట్టారు.. ఆ బాధ నాకు తెలుసు.. నీ తండ్రి విషయంలో నీ బాధని నేను అర్థం చేసుకోగలను..’ అని సోనియా గాంధీ చెప్పడంతో, వైఎస్ షర్మిల కన్విన్స్ అయిపోయారట.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి వైఎస్ షర్మిల, ఓ ‘యాత్ర’ లాంటిదాన్నొకటి చేపట్టారు. బస్సుల్లో ప్రయాణించారు, ప్రజలతో మమేకం అయ్యారు. వైసీపీ సర్కారు మీద తీవ్ర విమర్శలూ చేసేశారు వైఎస్ షర్మిల. ఇదంతా దేనికోసం.? ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసమా.? అలా చేస్తే, వైఎస్ షర్మిలకేంటి లాభం.?

ఏం చేసినా, ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం లేదు. ఆ విషయం అందరికన్నా బాగా వైఎస్ షర్మిలకే తెలుసు. తెలిసీ, ఎందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా అవకాశం అనగానే, వైసీపీలో ఆమె చేరినట్టు.? రాజ్యసభ పదవి కోసమా..? కాంగ్రెస్‌ని నమ్ముుకుంటే అంతే సంగతులు.. అని ఆమెకు తెలియదని ఎలా అనుకోగలం..?

తోడబుట్టిన అన్న కంటే, సోనియా గాంధీ మీద వైఎస్ షర్మిలకి ఇంతటి నమ్మకమేంటో వున్నపళంగా వైఎస్ షర్మిల దృష్టిలో సోనియా గాంధీ గాడ్ మదర్ అయిపోవడమేంటో.!