Home Tollywood కోర్టు కెక్కిన ‘వాల్మీకి’వివాదం,ఎవరిది తప్పు?

కోర్టు కెక్కిన ‘వాల్మీకి’వివాదం,ఎవరిది తప్పు?

‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అంటించిన వాల్మీకి చిత్రం వచ్చే నెల 13న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల దగ్గర పడుతుండగా చిత్రంపై వివాదాలు రాజుకుంటున్నాయి. గత కొంతకాలంగా వాల్మీకి సినిమా టైటిల్‌ మార్చాలంటూ మొదలైన వివాదం ముదిరి ఈ రోజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

బోయ వాల్మీకి కులస్థుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా చిత్రాన్ని రూపొందించారని, సినిమా టైటిల్‌ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని బోయ హక్కుల సమితి పిటిషన్‌ దాఖలు చేసింది. అలాగే తమ కులస్థులను కించపరిచేలా సినిమా తీసిన చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం షూటింగ్ నిమిత్తం అనంతపురం వెళ్తే అక్కడి వాల్మీకి కులస్తులు అడ్డుకున్నారు. దీనితో ఈ చిత్రం టీమ్ కు రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ కొంత టెన్షన్ పెరుగుతోంది. వివాదాన్ని కోర్టు బయిట సెటిల్ చేసుకోకుండా హరీష్ శంకర్ మొండిపట్టు పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే వాల్మికి అనే పేరుకేవలం ఓ కులానికి సంభందించినది అంటే ఎలా అనేది మరి కొందరి వాదన.

ఇక తొలిసారిగా విలన్ కనిపించబోతున్న వరుణ్ తేజ్ లుకే సినిమాకు హైలైట్ గా నిలిచింది. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

క్రాక్ హిందీ రీమేక్ రైట్స్.. డిమాండ్ మామూలుగా లేదు

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తరువాత సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ డైలీ కోటికి తక్కువ రావడం లేదు. ఇక రానున్న రోజుల్లో థియేటర్స్...

మరో సినిమాతో బిజీగా మారనున్న మెగాస్టార్.. డేట్ ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అపజయం లేని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు....

Latest News