‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ త్వరలోనే ఓ తెలుగు సినిమా చేయబోతున్నారని, అదీ ఎన్టీఆర్ హీరోగా ఉండబోతోందని ఆ మధ్య పలు వార్తలు వినిపించాయి. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అయిందని తెలిసింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యర్నేని ఓ వీడియో ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘కేజీఎఫ్’ చిత్రం ఎన్టీఆర్‌కు చాలా నచ్చింది. ఆ దర్శకుడితో సినిమా చేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్ 2’తో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు. వాళ్ల ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమా ఉంటుంది. వచ్చే ఏడాది మార్చిలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
కే జి ఎఫ్ లో జూనియర్ ఎన్టీఆర్
