కమిడియన్ సిక్స్ ప్యాక్ చూస్తే ..హీరోలు కుళ్లు కోవాల్సిందే !

 

అవును ..ఎంతసేపూ హీరోలే సిక్స్ ప్యాక్ లు చేసి జనాలు చేత జై కొట్టించుకోవాలా..మేము చెయ్యకూడదా అనుకున్నాడో ఏమో …తమిళ  హాస్యనటుడు సూరి..సిక్స్ ప్యాక్ అదరకొట్టాడు. సూరి అంటే గుర్తు రాలేదా. తమిళ నించి డబ్బింగ్ అయిన చాలా సినిమాల్లో సూరి మెయిన్ కమిడయన్ ఉంటాడు. ఈ మధ్యనే కార్తి హీరోగా వచ్చిన చినబాబులోనూ సూరి కామెడీ చేసి ఇరదీసాడు. అలాంటి సూరి సిక్స్ ప్యాక్ చేసి దుమ్ము రేపుతున్నాడు.

శివకార్తికేయన్, సమంత కాంబినేషన్ లో రూపొందుతున్న సీమరాజా సినిమా కోసం ఇలా సిక్స్ ప్యాక్ చేసాడట. ఈ విషయాన్ని ఇదిగో శివకార్తికేయన్ తన ట్వీట్ ద్వారా తెలియచేసాడు. ఈ ఫొటో చూస్తూంటే ఏ హీరోకి అయినా కుళ్లు వచ్చేస్తుంది కదా. ఇక సూరి సిక్స్ ప్యాక్ చేయటం కేవలం యాధృచ్చికమైనా లేక ఏదైనా సినిమాలో హీరోగా చేస్తున్నాడా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. నిప్పు లేనిదే పొగ రాదు కదా. చూద్దాం..కమిడయన్స్ హీరోలు అవటం మనకు కొత్త కాదు కదా. ఏమంటారు.