కనికా క‌పూర్ ఇంటి నుంచి పారిపోయిందా?

బాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపిన సింగ‌ర్ క‌నికా క‌పూర్‌. క‌రోనా స్వైర విహారం మొద‌లుపెట్టిన వేళ లండ‌న్ నుంచి ఇండియా వ‌చ్చిన క‌నికా క‌పూర్ ప‌లు వీఐపీల పార్టీల్లో పాల్గొని క‌ల‌క‌ల‌కం రేపింది. ఆ త‌రువాత ఆమెకు క‌రోనా ల‌క్ష‌ణాలున్నాయ‌ని బ‌య‌ట‌ప‌డ‌టంతో ఆమెతో పార్ట‌ల్లో పాల్గొన్న వారంతా హాస్ప‌ట‌ల్స్ చుట్టూ ఉరుకులు ప‌రుగులు పెట్టాల్సి వ‌చ్చింది.

వ‌సుంధ‌రరాజే సింధియాతో పాటు ప‌లువురు రాజ‌కీయ నేత‌లు భ‌యంతో వ‌ణికిపోయ‌చారు. బాలీవుడ్ వ‌ర్గాలు క‌నికా క‌పూర్ బాధ్య‌తారాహిత్యంపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌డంతో క‌నికా క‌పూర్ వార్త‌ల్లో నిలిచింది. భార‌త్‌లో కరోనా విజృంభిస్తున్న వేళ ప్ర‌ధ‌మంగా క‌నికా క‌పూర్ పేరు వార్త‌ల్లో నిలిచింది. ఐసోలేష‌న్ వార్డులో వున్న క‌నిక‌కు ఐదు సార్లు టెస్టులు నిర్వ‌హించినా పాజిటివ్ రావ‌డంతో బాలీవుడ్ వ‌ర్గాలు మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌య్యాయి. తాజాగా ఆమెకు నెగెటివ్ రావ‌డంతో 14 రోజుల క్వారెంటైన్‌ని పాటించాల‌ని చెప్పి డాక్ట‌ర్లు ఆమెని డిచ్చార్జ్ చేశారు.

అయితే డిచ్చార్జ్ అయిన క‌నికి ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింద‌ని బాలీవుడ్‌లో వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌పై క‌నిక స్పంధించింది. తాను ఎక్క‌డికి పారిపోలేద‌ని, ఇంటి ప‌ట్టునే ఫ్యామిలీతో వున్నాన‌ని, నా పై చాలా స్టోరీలు అల్లేస్లున్నార‌ని, వాటిలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో బాలీవుడ్ వ‌ర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.