తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకనాటి అందాల తార జయలలిత జీవిత కథ ఆధారంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో `తలైవీ` పేరుతో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయలలిత పాత్రలో కంగన రనౌత్ నటిస్తోంది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు వరల్డ్ వైడ్‌గా అనువదించబోతున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ నిర్మిస్తున్నారు.
ఎమ్జీఆర్ పాత్రలో అరవిందస్కవామి, కరుణానిథి పాత్రలో ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం రెండు షెడ్యూల్స్‌ని హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. ఇందు కోసం రామకృష్ణా సినీ హర్థికల్చరల్ స్టూడియోస్‌లో భారీ పార్లమెంట్ సెట్‌ని ఏర్పాటు చేశారు. చెన్నైలోనూ సినీ నేపథ్యానికి సంబంధించిన సెట్లని ఏర్పాటు చేశారట. దీని కోసం ఏకంగా 5 కోట్లు ఖర్చు చేశారట. 45 రోజుల షెడ్యూల్ కోసం ఈ సెట్‌ని ప్లాన్ చేశారని, మార్చి 10 నుంచి ఈ షెడ్యూల్ మొదలుపెట్టాలి.
కానీ అది కుదరలేదు. తరువాత నుంచి కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఈ సినిమా కోసం వేసిన సెట్లని కూల్చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిసింది. అదే చేస్తే నిర్మాతలకు 5 కోట్లు కష్టం. ఇప్పటికే వర్షాల కారణంగా కొంత భాగం సెట్లు పాడైపోయాయట. లాక్డౌన్ కారణంగా స్టూడియోలకు డబుల్ రెంట్ కట్టివ్వాల్సి వస్తోందని నిర్మాత శైలేష్ ఆర్. సింగ్ ఓ బాలీవుడ్ మీడియాకు వెల్లడించారు.