ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడా..?

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడా అనే ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయాన్ని పరోక్షముగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ బయట పెట్టారు. వరుణ్ మన జూనియర్ కి వీరాభిమాని. తారక్ ఫైట్లన్నా, డ్యాన్సన్నా బాగా ఇష్టమట ఆ కుర్ర హీరోకి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తానే అభిమానులకి తెలియజేసాడు.

ఈ సందర్భముగా ఓ అభిమాని ఎన్టీఆర్ కూడా మీతోపాటు ‘ర‌ణ్‌భూమి’లో నటించే అవకాశం ఉండ అని వరుణ్ ని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సూటిగా అవకాశం ఉంది అని చెప్పలేదు కానీ పరోక్షముగా హింట్ ఇచ్చాడు ధావన్. అయినా ఇటువంటి విషయాలు నాకంటే దర్శకుడు శ‌శాంఖ్‌ఖైతాన్ చెప్పడమే కరెక్ట్ అంటూ ట్వీట్ చేసాడు. దీంతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ పక్కా అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ‘ర‌ణ్‌భూమి’ రిలీజ్ టైముకి ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.