ఉత్తేజ్ కి కెసిఆర్ ని నాయన అని పిలవాలని వుందట!

న‌టుడు, ర‌చ‌యిత ఉత్తేజ్ ఉన్న‌ట్టుండి తెలంగాణ ముఖ్య‌మంత్రిపై ఓ సంచ‌ల‌న వీడియోని వ‌దిలాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. లాక్‌డౌన్ పొడిగించిన వేళ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తెలంగాణ గ్రామీణ యాస‌లో ఉత్తేజ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఉన్న‌ట్టుండి ఉత్తేజ్‌కు ఈ ఆలోచ‌న ఎలా వ‌చ్చింది? అని నెటిజ‌న్స్ అవాక్క‌వుతున్నారు.

ఏ రోజూ తెలంగాణ సీఎంని క‌ల‌వ‌ని ఉత్తేజ్ తాజాగా సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ఆడియో వాయిస్ ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. సాక్షాత్తు ముఖ్య‌మంత్రినే ఈ వీయిస్ వీడియోలో ఉత్తేజ్ న‌న్ను నాయ‌నా అని పిల‌వాల‌ని వుంద‌ని చెప్ప‌డం వైర‌ల్‌గా మారింది. మిగ‌తా రాష్ట్రాల ముఖ్య మంత్రుల‌తో పోలిస్తే తెలంగాణ సీఎం రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం తీసుకుంటున్న జాగ్ర‌త్త‌ల‌కు ముగ్ధుడైన ఉత్తేజ్ భావోద్వేగానికి లోనై ఆస‌క్తిక‌ వ్యాఖ్య‌ల‌తో ఓ వీడియోని రూపొందించాడు.

వీడియో వాయిస్‌లో `నిన్ను నాయినా అని పిల‌వాల‌ని వున్న‌దే.. మొన్న టీవీలో నిన్ను చూసినంక.. నీ మాట‌లు ఇన్నంక నీ చెయ్యితోని మా కండ్ల‌నీళ్లు తుడిచిన‌ట్టు.. మా భుజాల మీద చేయి వేసి ధైర్యం చెప్పిన‌ట్టు .. మా ఇంట్లో మ‌నిషివైన‌ట్టు కొట్టిందే.. నిన్నుచూసినా నీ మాట‌లిన్నా బ్ర‌తుకు మీద న‌మ్మ‌కం వ‌త్త‌ది..భ‌యం అన్న‌ది ఆమ‌డ దూరం బోత‌తి.. ఇది నా ఒక్క‌డి మాట కాదు యావ‌త్ తతెలుగు వాళ్లంద‌రిదీ.. అని ఉత్తేజ్ భావోద్వేగంగా చెప్పిన మాట‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles