ఈ స‌మ‌యంలో చైత‌న్య ఏం చేస్తున్నాడు?

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్ద‌ని ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ప్ర‌భుత్వం, పోలీసులు క‌రాకండీగా చెబుతున్నారు. దీంతో ప్ర‌తీ ఒక్క‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అయిపోయారు.

ఈ స‌మ‌యంలో సెల‌బ్ర‌టీలు ఏం చేస్తున్నారు?. ఈ స‌మ‌యాన్ని ఎలా స‌ద్విన‌యోగం చేసుకుంటున్నారు? అన్న ఆసక్తి అంద‌రిలోనూ మొద‌లైంది. కొంత మంది న‌చ్చిన ప‌నులు చేస్తున్నారు. కొంత మంది త‌మ‌కు న‌చ్చిన వంట‌లు నేర్చుకుంటున్నారు.

కొంత మంది తార‌లు త‌మ‌కు న‌చ్చిన పెయింటింగ్ వేస్తున్నారు. కొంద‌రు న‌చ్చిన పుస్త‌కాలు చ‌దువుతున్నారు. కొంత మందేమో క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. యంగ్ హీరో నాగ‌చైత‌న్య మాత్రం హ‌ష్‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. హ‌ష్ పెంపుడు కుక్క.

చై , స‌మంత‌ హ‌ష్‌తో స‌ర‌దాగా తీసుకున్న ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. హ‌ష్‌ని భుజాల‌పై ఎత్తుకుని చై వెళుతున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.