“అరవింద సమేత వీర రాఘవ” లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత తన క్రేజీ దర్శకుడు రాజమౌళితో RRR అనే భారీ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ సినిమాలో తారక్ లుక్ కోసం అతని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ విషయాలు పక్కన పెడితే టాప్ మోస్ట్ హీరోలు ఏం చేసినా సరే దాన్ని రికార్డులుగా పరిగణించడంలో నిమగ్నం అయ్యిపోయారు. ఇప్పుడు అందరికి హీరోల ఫ్యాన్స్ సరే అది తప్పు కాదు. కానీ ఎలాంటి విషయాల్లో అన్నది కూడా అంతా గమనించాలి కదా.. ఇప్పుడు తారక్ అభిమానులు ఓ రికార్డు కోసం ఎందుకో వెంపర్లాడుతున్నారు.
తాజాగా తెలంగాణాలో కలకలం రేపిన దిషా ఘటనలోని నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ లో హతమార్చిన సంగతి తెలిసిందే. దీనితో అప్పటి వరకు రెస్పాండ్ కానీ చాలా మంది సినీ తారలే ముందుకు వచ్చి వారిని మెచ్చుకొని దిషా ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరుతుందని తమ తమ సోషల్ మీడియా ఖాతాలు ద్వారా స్పందించారు. అలాగే తారక్ కూడా ట్వీట్ పెట్టారు. తీరా ఈ ట్వీట్ కు భారీగా లైకులు వచ్చి పడగా దానిని కాస్తా తీసుకెళ్లి టాలీవుడ్ లోనే మోస్ట్ లైక్డ్ ట్వీట్ గా మార్చెయ్యాలని ఆ రికార్డు మనమే నెలకొల్పాలని ప్రచారం చేస్తున్నారు ఫ్యాన్స్. అసలు తారక్ పెట్టిన ట్వీట్ ఉద్దేశ్యం ఏమిటి..దానిని వీరు రికార్డుగా మార్చాలని చూడడం ఏమిటి అసలు. ఇలాంటి విషయాల్లో కూడా రికార్డుల కోసం వెంపర్లాడడం నిజంగా వీరికే చెల్లిందని చెప్పాలి. ఇలాంటి పనులు చేయడం వల్ల ముందు పాపం హీరోలు ఎటూ చెప్పలేక కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు పడుతుంటారు. అటు ఫ్యాన్స్‌కి చెప్పలేరు ఇటు ఏమీ చెయ్యలేరు. కానీ పాపం వాళ్ళు మనుషులే వాళ్ళ ఫీలింగ్స్ కూడా మనలాగానే ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్వీట్‌ని పెడతారు అంత మాత్రాన దాన్ని పెద్దది చేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటారు కొందరు. ఇదెక్కడి ఆనందమో ఎవ్వరికీ అర్ధం కాదు. ఏదైన ఒక పని చేసేముందు సమయం సందర్భం కూడా ఉండాలి కదా అని కొందరు అంటున్నారు.