ఆ హీరో తండ్రి న‌న్ను ఇబ్బంది పెట్టారు: మెహ్రీన్‌

హీరోయిన్‌లు ప్ర‌మోష‌న్‌ల‌కి డుమ్మాకొట్ట‌డం, హోట‌ల్ బిల్లులు ల‌క్ష‌ల్లో క‌ట్టించ‌డం అనేది చాలా ఏళ్లుగా జ‌రుగుతూనే వుంది. ఇదే తాజాగా వివాదానికి కార‌ణంగా మారింది. నాగ‌శౌర్య హీరోగా న‌టించిన చిత్రం `అశ్శ‌థ్థామ‌`. ఇందులో హీరోయిన్‌గా మెహ్రీన్ న‌టించింది. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న మెహ్ర‌రీన్ ఆ త‌రువ‌త మీడియా ఇంట‌ర్వ్యూల‌కు మాత్రం ముఖం చాటేసింది. అదేమంటే త‌న తాత‌య్య‌కు హార్ట్ ఎటాక్ అని చెప్పి మీడియా ముందుకు రావ‌డానికి నిరాక‌రించింది.

దీంతో నాగ‌శౌర్య తండ్రి శంక‌ర‌ప్ర‌సాద్‌కు ఆగ్ర‌హించి మెహ్రీన్ హోట‌ల్ బిల్స్‌ని చెల్లించేది లేదంటూ హెహ్రీన్‌కు చెప్పేశాడ‌ట‌. దీంతో వివాదం ముదిరింది. ఇలాంటి ప‌ద్ద‌తి మంచిది కాద‌ని, హోట‌ల్ బిల్లులు చెల్లించాల‌ని అడిగింద‌ట‌. ఎంత అడిగినా శంక‌ర‌ప్ర‌సాద్ చెల్లించ‌క‌పోవ‌డంతో తానే చెల్లించి హొట‌ల్ రూమ్‌ని ఖాలీ చేసి వెళ్లిపోయింద‌ట‌. దీనిపై ఇటీవ‌ల వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. దీంతో మౌనం వీడిన మెహ్రీన్ త‌న‌ని నాగ‌శౌర్య‌, అత‌ని తండ్రి శంక‌ర‌ప్ర‌సాద్ ఇబ్బంది పెట్టార‌ని, ప్ర‌మోష‌న్స్‌కి రానంటే హోట‌ల్ బిల్స్ కూడా క‌ట్ట‌లేద‌ని, ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని, దీని కార‌ణంగా ఇండ‌స్ట్రీలో త‌న పెప్యుటేష‌న్ దెబ్బ‌తింద‌ని వాపోయింది.

ఇక ఇక్క‌డితో ఈ టాపిక్‌ని వ‌ద‌లేద్దామ‌ని, దీని కార‌ణంగా త‌న కెరీర్ ద‌క్షిణాదిలో ఇబ్బందుల్లో పడే ప్ర‌మాదం వుంద‌ని మెహ్రీన్ స్పష్టం చేసింది. మ‌ని మెహ్రీన్ స్పంద‌న‌పై నాగ‌శౌర్య‌, అత‌ని తండ్రి శంక‌ర‌ప్ర‌సాద్ ఎలా స్పందిస్తారో చూడాలి.