‘స్పార్క్ లైఫ్’ నాకు పెద్ద ఎమోష‌న‌ల్ జ‌ర్నీ.. న‌వంబ‌ర్ 17న రిలీజ్: హీరో విక్రాంత్‌

విక్రాంత్ ఈ సినిమాతో హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ‘స్పార్క్ లైఫ్’. మెహ‌రీన్, రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్స్‌. ఈ చిత్రానికి క‌థ‌ను అందిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు విక్రాంత్‌. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై లీల ఈ చిత్రాన్ని నిర్మించారు. న‌వంబ‌ర్ 17న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. మంగ‌ళ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఈ సంద‌ర్భంగా…

పీపుల్ మీడియా టి.జి.విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘‘విక్రాంత్ నాకు మూడు నాలుగు నెలల నుంచి పరిచయం. మొదటి సినిమాతోనే విక్రాంత్ చేసిన రిస్క్‌, ఎక్స్‌పెరిమెంట్ నాకు ఎంతో న‌చ్చింది. త‌న‌కు సినిమాపై మంచి అవగాహ‌న ఉంది. భ‌విష్య‌త్తులో త‌ను మ‌రిన్ని సినిమాలు చేస్తార‌ని అనుకుంటున్నాను’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేషం అబ్దుల్ వ‌హాబ్ మాట్లాడుతూ ‘‘నేను స్పార్క్ సినిమాలో విక్రాంత్ అండ్ టీమ్‌తో క‌లిసి ప‌ని చేయ‌టాన్ని ఎంజాయ్ చేశాను. మ‌ణిర‌త్నంగారి సినిమాల‌కు నేను పెద్ద అభిమానిని. ఈ స్టేజ్‌పై ఇలా ఉండ‌టంపై గ‌ర్వంగా అనిపిస్తుంది. గౌర‌వంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో వ‌ర్క్ చేయ‌టం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఖుషితో తెలుగు ప్రేక్ష‌కులు నాపై ఎంతో ప్రేమ‌ను కురిపించారు. అదే ఎన‌ర్జీతో స్పార్క్ సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాను. విక్రాంత్, మెహ‌రీన్, రుక్స‌ర్‌, గురు సోమ‌సుంద‌రం వంటి వారితో క‌లిసి ప‌ని చేయ‌టంపై ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు.

డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ ‘‘స్పార్క్ ఎంటైర్ టీమ్‌కు ముందుకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. నిజం చెప్పాలంటే సుహాసినిగారు, మెహ‌రీన్‌, రుక్స‌ర్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేషం, అనంత శ్రీరాంగారు త‌ప్ప ఇంకెవ‌రీ పేర్లు తెలియ‌వు. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత సినిమా పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యి.. అంద‌రి పేర్లు ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోవాల‌ని కోరుకుంటున్నాను. యంగ్ టాలెంట్ ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌స‌రం. ట్రైల‌ర్ చూశాను. చాలా రిచ్‌గా ఉంది. చాలా పెద్ద పెద్ద టెక్నీషియ‌న్స్ ఉన్నారు. ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ చాలా గొప్ప‌గా ఉన్నాయి. యాక్ష‌న్‌, విజుల్స్ అన్నీ సూప‌ర్బ్‌గా ఉన్నాయి. గురు సోమ‌సుంద‌రంగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయాల‌నుకున్నాను. కానీ కుద‌ర‌లేదు. త్వ‌ర‌లోనే చేస్తాన‌ని అనుకుంటున్నాను. అలాగే విక్రాంత్, లీలాగారు చాలా క‌ష్ట‌ప‌డి ప్యాష‌న్‌తో ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నారు. వారికి టాలీవుడ్ ఇండ‌స్ట్రీ వెల్‌క‌మ్ చెబుతుంది. అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌. టీజ‌ర్‌, ట్రైల‌ర్ రాకింగ్‌గా ఉన్నాయి. న‌వంబ‌ర్ 17న ఈ మూవీ వ‌స్తుంది. సినిమాను థియేట‌ర్స్‌లో చూడాల‌నుకుంటున్నాను’’ అన్నారు.

డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ ‘‘నేను ఓసారి ఫ్లైట్‌లో వెళుతున్న‌ప్పుడు రుక్స‌ర్ ఈ మూవీలోని ఏమా అందం సాంగ్‌ను నాకు చూపించింది. కొత్త హీరోపై ఇంత ఖ‌ర్చు పెట్టి చాలా బాగా సాంగ్ చేశారే అనిపించింది. విక్రాంత్ హీరోగా మారి, త‌నే క‌థ రాసుకుని సినిమా చేశాడు. త‌ను అమెరికా నుంచి ఇక్క‌డ‌కు వ‌చ్చి క్రాఫ్ట్స్ గురించి నేర్చుకుని పెద్ద బ‌డ్జెట్ మూవీగా స్పార్క్ చేసిన విక్రాంత్‌ను అభినందిస్తున్నారు. సినిమా అన్నీ రకాలుగా ప్రేక్ష‌కులను మెప్పిస్తుంద‌ని భావిస్తున్నాను. విక్రాంత్‌కి పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంద‌నుకుంటున్నాను. మెహ‌రీన్ ఈ సినిమా గురించి ఎప్పుడూ చెబుతుంటుంది. త‌ప్ప‌కుండా సినిమాను చూసి పెద్ద హిట్ చేస్తార‌ని అనుకుంటున్నాను. హేషం మ్యూజిక్ ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వింటున్నాం. త‌క్కువ కాలంలోనే త‌న మ్యూజిక్ మాస్‌లోకి వెళ్లింది. స్పార్క్ పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

గురు సోమ‌సుంద‌రం మాట్లాడుతూ ‘‘మా స్పార్క్ మూవీ నవంబర్ 17న థియేటర్స్‌లోకి రానుంది. క‌చ్చితంగా అంద‌రూ సినిమాను థియేట‌ర్స్‌లోనే చూడండి. ఎందుకంటే ఓ మూవీ ఎక్స్‌పీరియెన్స్ కావాలంటే థియేట‌ర్స్‌లోనే సినిమాను చూడాలి. త‌మిళం, మ‌లయాళ సినీ ఇండ‌స్ట్రీల త‌ర్వాత తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. సుహాసినిగారు నాకు ఎంతో ఇష్ట‌మైన న‌టి. ఆమెతో క‌లిసి ఈ సినిమాలో న‌టించ‌టం చాలా హ్యాపీ. విక్రాంత్‌గారికి సినిమా అంటే చాలా ప్యాష‌న్‌. నన్ను కొచ్చిలో క‌లిసి నువ్వే విల‌న్ అని చెప్పేశారు. నాపై అభిమానంతో న‌న్ను విల‌న్‌గా ఇక్క‌డ ప‌రిచ‌యం చేశారు. మెహ‌రీన్‌, రుక్స‌ర్ స‌హా అంద‌రికీ థాంక్స్‌. నేను విల‌న్‌గా ఎక్కువ‌గా న‌టించాల‌నుకున్నాను. నేను చూడటానికి విల‌న్ ఫిజిక్‌తో ఉండ‌ను. కానీ మిన్న‌ల్ ముర‌ళి సినిమాలో విల‌న్‌గా న‌టించి మెప్పించాను. ఇప్పుడు స్పార్క్‌లోనూ విల‌న్‌గా న‌టించాను. హేషం అబ్దుల్ వ‌హాబ్ అందించిన సంగీతం చాలా గొప్ప‌గా ఉంది. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

సుహాసిని మాట్లాడుతూ ‘‘అబ్దుల్ వహాబ్‌గారు అద్భుతంగా సంగీతాన్ని అందిస్తున్నారు. విక్రాంత్‌, మెహ‌రీన్‌ల‌తో నేను, నాజ‌ర్‌, గురు సోమ‌సుంద‌రం క‌లిసి యాక్ట్ చేశాం. మాకు తెలుగు ప్రేక్ష‌కుల నుంచి దొరికి వెల్‌క‌మింగ్ చూసి హ్యాపీగా అనిపిస్తుంది. మెహ‌రీన్‌, రుక్స‌ర్‌, ల‌హ‌రి చక్క‌గా ఉన్నారు. ఒక సైంటిస్ట్‌గా న‌న్ను ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చూపించ‌లేదు. తొలిసారి విక్రాంత్ న‌న్ను అలా చూపించినందుకు థాంక్స్‌. గురు సోమ‌సుంద‌రం త‌మిళ వాడైన‌ప్ప‌టికీ తెలుగు నేర్చుకుని మ‌రీ డ‌బ్బింగ్ చెప్పారు. త‌న టాలెంట్ చూసి షాక‌య్యాను. విక్రాంత్ చాలా మంచి వ్య‌క్తి. త‌ను రీసెర్చ్ చేసి ఈ సినిమాను రూపొందించారు. త‌న‌లో మంచి యాక్టర్ ఉన్నాడు. ఈ మూవీలో న‌న్ను పార్ట్ చేసిన విక్రాంత్ అండ్ టీమ్‌కి థాంక్స్‌. స్పార్క్ సినిమాను న‌వంబ‌ర్ 17న థియేట‌ర్స్‌లో చూసి పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత లీల మాట్లాడుతూ ‘‘నాకు ముందు సినిమా గురించి అవగాహన లేదు. ప్రారంభంలో నేను డే అండ్ నైట్ సెట్స్‌లోనే ఉండేదాన్ని. ప్రాసెస్ అర్థం చేసుకున్న త‌ర్వాత రిమోట్ కూడా హ్యాండిల్ చేయ‌వ‌చ్చున‌ని ట్రై చేశాను. వ‌ర్క‌వుట్ అయ్యింది. నాకు నా టీమ్ కూడా స‌పోర్ట్ చేసింది. సుహాసిని, నాజ‌ర్‌, మెహ‌రీన్‌, రుక్స‌ర్ స‌హా అంద‌రూ స‌పోర్ట్ చేశారు. టీమ్‌లోని ప్ర‌తీ ఒక్క‌రూ నా మూవీ అని భావించి స్కార్క్ మూవీ చేశారు. సినిమా చూశాను. చాలా బాగా వ‌చ్చింది. న‌వంబ‌ర్ 17న రిలీజ్ అవుతున్న సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు.

మెహ‌రీన్ మాట్లాడుతూ ‘‘స్పార్క్ మూవీలో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం చాలా హ్యాపీగా అనిపించింది. సుహాసినిగారితో క‌లిసి రెండో సినిమాకు వ‌ర్క్ చేశాను. విక్రాంత్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. త‌నెంతో హార్డ్ వ‌ర్క్ చేశారు. యాక్ట‌ర్ కావాల‌నే క‌ల‌ను నేర‌వేర్చుకుంటున్నారు. హీరోగా న‌టిస్తూనే డైరెక్ట్ చేశారు. క‌థ‌ను కూడా త‌నే త‌యారు చేసుకున్నారు. లీలాగారికి థాంక్స్‌. మ‌హిళా నిర్మాత అయిన ఆమెకు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వెల్‌క‌మ్ చెబుతున్నాను. రుక్స‌ర్ థిల్లాన్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం ల‌వ్‌లీగా అనిపించింది. అబ్దుల్ వ‌హాబ్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. గురు సోమ‌సుంద‌రంగారికి కూడా ఇక్క‌డ వెల్క‌మ్ చెబుతున్నాను. అలాగే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రికీ థాంక్స్‌. న‌వంబ‌ర్ 17న స్పార్క్ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

రుక్స‌ర్ థిల్లాన్ మాట్లాడుతూ ‘‘సుహాసినిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆమెతో క‌లిసి స్పార్క్ సినిమాలో న‌టించ‌టం సంతోషంగా ఉంది. కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి తెలుగు ప్రేక్ష‌కులు న‌న్నెంతో స‌పోర్ట్ చేస్తున్నారు. ప్రతీ సినిమాలో కొత్త క‌నిపించ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటాను. హేషం అబ్దుల్ ఎక్స్‌ట్రార్డినరీ సంగీతాన్ని అందించారు. ప్రతీ సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మిన్న‌ల్ ముర‌ళి సినిమాను చూసి గురు సోమ సుంద‌రంగారికి పెద్ద ఫ్యాన్‌గా మారిపోయాను. ఆయ‌న‌తో క‌లిసి స్పార్క్ మూవీలో న‌టించటం ల‌క్కీగా భావిస్తున్నాను. మెహ‌రీన్‌తో క‌లిసి తొలిసారి న‌టించాను. త‌ను మంచి కోస్టార్‌. మా నిర్మాత లీల‌గారు అమేజింగ్ ప‌ర్స‌న్‌. ఈ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచి సినిమాను ఇంత రిచ్‌గా రూపొందించారు. ఆమెకు స్పెష‌ల్ థాంక్స్‌. ఆమె మ‌రిన్ని సినిమాల‌ను నిర్మించాల‌ని కోరుకుంటున్నాను. మా హీరో, డైరెక్ట‌ర్ విక్రాంత్‌కు ఆల్ ది బెస్ట్. త‌నేంతో హార్డ్ వ‌ర్క్ చేశారు. మాకెంతో స‌పోర్ట్ అందించారు. తెలుగు ప్రేక్ష‌కులు త‌న‌ను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ఛాలెంజింగ్‌గా పూర్తి చేశారు. స్పార్క్ మూవీ న‌వంబ‌ర్ 17న రిలీజ్ అవుతుంది. తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

హీరో విక్రాంత్ మాట్లాడుతూ ‘‘స్పార్క్ చాలా పెద్ద ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. ఆల్ రెడీ లైఫ్‌లో సెటిలై, రొటీన్‌గా సాగుతున్న లైఫ్‌లో స‌డెన్‌గా ఓరోజు నేనేదో ఉంటున్నాను. బ్ర‌త‌క‌టం లేదనిపించింది. దాంతో ఆరోజునే నాకెంతో ఇష్ట‌మైన సినిమా రంగంలోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ప్ర‌య‌త్నం చేయ‌టం మాత్రం మ‌న చేతిలో ఉంది. ఫ‌లితం మ‌న చేతిలో ఉండ‌ద‌ని భ‌గ‌వ‌ద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. అలాగే స్పార్క్ మూవీని తీయ‌టం నా ప్ర‌య‌త్నం. ఫ‌లితం మాత్రం ప్రేక్ష‌క దేవుళ్ల చేతిలో ఉంది. ముందుగా వారికి థాంక్స్‌. హ‌రీష్‌గారు, మారుతిగారు, టిజి.విశ్వ‌ప్ర‌సాద్‌గారు మ‌మ్మ‌ల్ని స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చినందుకు వారికి స్పెష‌ల్ థాంక్స్‌. నేను క‌థ రాసుకుని నేనే హీరోగా సినిమా చేద్దామ‌ని చాలా మందిని క‌లిసిన‌ప్పుడు అవ‌దు, కాదు, చేయ‌లేవంటూ చాలా మంది అన్నారు. వాళ్లేవ‌రో కాదు.. నా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌. సినిమా మేకింగ్ నీకు రాదు.. కంప్లీట్ చేయ‌లేవ‌ని అన్నారు. నేనెక్క‌డ ఇబ్బంది ప‌డ‌తానోన‌ని వారు నాపై ప్రేమ‌తో చెప్పారు. అయితే నేను త‌ల దించుకుని నా వ‌ర్క్‌పై శ్ర‌ద్ధ‌గా నా క‌ల‌ను నేర‌వేర్చుకోవ‌టానికి ముందుకు న‌డిచాను. చెవిటి క‌ప్ప‌లాగా ఏడాదిన్న‌ర‌గా నా ప‌ని నేను చేసుకుంటూ వెళ్లిపోయాను. ఈ ప్ర‌యాణం నాకు ఈజీగా అనిపించ‌లేదు. నాకున్న నాలెడ్జ్‌తో ముందుకు అడుగేశాను. చాలా క‌ష్టాల‌ను ప‌డ్డాను. ఈ జ‌ర్నీలో నాకు చాలా మంది త‌మ వంతు స‌పోర్ట్ అందించారు. అలా స‌పోర్ట్ చేసిన వారంద‌రికీ శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. ముందుగా మా కోడైరెక్ట‌ర్ స్వామిగారికి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు సినిమా తెలియ‌దు. నా ద‌గ్గ‌ర క‌ల మాత్రం ఉంది. ఆయ‌న ద‌గ్గ‌ర అనుభ‌వం ఉంది. నా క‌ల‌ను, ఆయ‌న అనుభ‌వాన్ని జోడించి స్పార్క్ సినిమా చేశాం. 2017 డిసెంబ‌ర్‌లో ఈ క‌థ‌ను స్టార్ట్ చేశాను. ఆరేళ్ల ప్ర‌యాణం. అమెరికా జ‌రిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చూసి క‌థ‌ను రాసుకున్నాను. అయితే రియ‌ల్ లైఫ్ క‌థ‌లా కాకుండా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో ఉండాల‌ని మూడేళ్లు క‌ష్ట‌ప‌డి క‌థ‌ను రాసుకున్నాను. ఇన్నేళ్ల‌ను త‌ల దించుకుని ప‌ని చేసుకుంటూ వ‌చ్చాను. న‌వంబ‌ర్ 17న ఆడియెన్స్ త‌ల ఎత్తుకునే రిజ‌ల్ట్ ఇస్తార‌ని న‌మ్ముతున్నాను. ఇది నా ఆరేడేళ్ల క‌ష్టం. హీరో కంటే విల‌న్ రోల్ ప‌వ‌ర్ఫుల్‌గా ఉండాలి. దాన్ని గురు సోమ‌సుంద‌రంగా అద్భుతంగా చేశారు. కెమెరా వెనుక మ‌రోలా ఉంటారు. కెమెరా ముందుకు రాగానే కొత్తగా క‌నిపిస్తారు. రుద్ర పాత్ర‌లో నేను అనుకున్న దానికంటే గొప్ప‌గా న‌టించారు. రేపు సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కులు ఈ విష‌యాన్ని అంగీక‌రిస్తారు. మెహ‌రీన్‌, రుక్స‌ర్ నా కోస్టార్స్ అయిన‌ప్ప‌టికీ నాకు మాస్ట‌ర్స్‌లాగా న‌డిపించారు. వెన్నెల కిషోర్‌, స‌త్య కామెడీతో మెప్పిస్తారు. సుహాసినిగారితో క‌లిసి ప‌ని చేయ‌టాన్ని న‌మ్మ‌లేక‌పోతున్నాను. ఓ క‌ల‌లాగా ఉంది. ఆమెతో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ఇంకా నాజ‌ర్‌, బ్ర‌హ్మాజీ, షాయాజీ షిండే, ల‌హ‌రి ఇలా అంద‌రూ గొప్ప‌గా న‌టించారు. అబ్దుల్ వ‌హాబ్ గొప్ప సంగీతాన్ని అందించారు. నేను అనుకున్న దానికంటే గొప్ప పాట‌ల‌ను ఇచ్చారు. అశోక్ కుమార్‌గారు వండ‌ర్‌ఫుల్ విజువల్స్‌ను ఇచ్చారు. నా పార్ట్‌న‌ర్ లీల ఎంతో స‌పోర్ట్ చేసింది. త‌న‌కు థాంక్స్‌. నా డ్రీమ్, మా అందరి డ్రీమ్ స్పార్క్ నవంబర్ 17న రిలీజ్ అవుతుంది. థియేటర్లో సినిమాను చూడండి. మ‌న‌సు పెట్టి, క‌ష్ట‌ప‌డి చేశాం’’ అన్నారు.