వసంత్ రవి, ద్విభాషా చిత్రం టైటిల్ ‘ఇంద్ర’

వసంత్ రవి హీరోగా జేఎస్ఎం పిక్చర్స్, ఎంపరర్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిసున్న తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రానికి ‘ఇంద్ర’ అనే టైటిల్ ని ఖరారు చేశారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని JSM పిక్చర్స్ ఏఆర్ జాఫర్ సాదిక్, ఎంపరర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇర్ఫాన్ మాలిక్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

నయనతార నటించిన ఐరా, మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ నవరస చిత్రాలలో పనిచేసిన శబరీష్ నందా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మెహ్రీన్‌ పిర్జాదా కథానాయికగా నటిస్తోంది.

వీరితో పాటు అనికా సురేంద్రన్, సునీల్, కళ్యాణ్ మాస్టర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టీం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.