ఆ విషయంలో చేతులెత్తేసిన నాగచైతన్య

నాగచైతన్య నటిస్తోన్న రెండు సినిమాలు సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు ఆగస్టులో విడుదలకు సిద్ధమయ్యాయి. రెండు సినిమాల నిర్మాతలు ఆగష్టులో విడుదల చేస్తున్నట్టు ప్రకటించేసారు. రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవడంతో అభిమానులు వర్రీ అవుతున్నారు. ఆ విషయమే చైతూకి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది.

సవ్యసాచి ముందు సెట్స్ పైకి ఎక్కింది, మేలో రిలీజ్ కావాల్సింది.. కానీ ఆ మూవీ డైరెక్టర్ పర్ఫెక్షన్ కోసం అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు షూటింగ్ జరిపారు. దీనితో ఈ సినిమా రిలీజ్ డేట్ మే నుండి ఆగష్టుకు షిఫ్ట్ అయ్యింది. ఇక శైలజారెడ్డి అల్లుడు సినిమాకి దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ మారుతి చక చకా షూటింగ్ పూర్తి చేసి ఆగష్టులో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆగస్టు 31 కి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది.

ఈ రెండు సినిమాలు ఆగష్టులోనే రిలీజ్ ఐతే రెండిటికి మధ్య పది రోజులు కూడా గ్యాప్ ఉండదు. నిర్మాతలు మాత్రం ఒకే నెలలో రిలీజ్ చేయటానికి పోటీ పడటంతో ఏమీ చేయలేక నాగచైతన్య చేతులెత్తేశాడంట. ఇక ఈ పంచాయతీని తేల్చటానికి నాగార్జునని అప్రోచ్ అయ్యారంటే అభిమానులు. మరి కింగ్ మాట విని ఏ ప్రొడ్యూసర్ వెనక్కి తగ్గుతారో ఏ సినిమా ముందు విడుదల అవుతుందో వేచి చూడాలి.