ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాగా వెనుకబడిన జిల్లాలు అంటే! గుర్తొచ్చేది రెండు జిల్లాలు మాత్రమే. అవే శ్రీకాకుళం..విజయనగరం జిల్లాలు. ప్రపంచం మొత్తం కరోనా కాటు వేస్తున్నా! కొవిడ్-19 పంజా విసురుతున్నా? వేలల్లో మరణాలు సంభవిస్తున్నా? కేసులు నమెదవుతున్నా? రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ అన్ని జిల్లాలను చుట్టేసినా ! ఏపీలో 12 జిల్లాలోనే కరోనా పవర్ చూపించినా? ఈ రెండు జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకలేదు. ప్రభుత్వం ముందొస్తు చర్యలో భాగంగా క్వారంటైన్లు…వైద్య సిబ్బందిని నియమించినా అదృష్టమో! ఏమోగానీ ఇప్పటి వరకూ శ్రీకాకుంళం …విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అనుమానిత కేసులుగా గుర్తించి క్వారైంటైన్లో బంధించినా 14 రోజులు క్వారైంటన్ ని ముగించికుని సంపూర్ణ ఆరోగ్య వంతులుగా స్వగ్రామాలకు చేరుతున్నారు.
మరి దీనంతటికి కారణం ఏంటి? అంటే ఆ రెండు జిల్లాల వాసులు ఒక్కటే ముక్త కంఠగా చెబుతున్నారు. ఈ జిల్లాల ప్రజలకు వీలైతే సహాయం తప్ప ఆపద తలపెట్టడం తెలియదంటున్నారు. దేవుడి దయ ఈ రెండు జిల్లాలలపై ఎప్పుడూ ఉంటుందంటున్నారు. ముఖ్యంగా సిక్కోలుగా పేరుగాంచిన శ్రీకాకుళం వాసులు ప్రతీ ఒక్కరూ ఆ తిరుమల శ్రీనువాసుడి నామ స్మరణం ఉంటుందంటున్నారు. పోద్దుటే లేచి తలస్నానం చేసి నుదిటిన రెండు తెల్ల నామాలు..ఒక ఎర్ర నామం పెట్టడం ఇక్కడ ఓ సంప్రదాయంగా మారిపోయిందంటున్నారు. దేవతలను కొలిచే ఆచారం పురాతన కాలం నుంచి ఇక్కడ వెల్లసిల్లిందేనని ఉద్ఘాటిస్తున్నారు. ఇక దేశ రక్షణలో..త్రివిధ దళాలలో సేవలందించడంలో ఈ రెండు జిల్లాల యువత సేవలు ఎప్పటికీ మరువలేనివే.
శ్రమించడంలో నిస్వార్ధం గల వ్యక్తిత్వాలు . పేద, ధనిక అనే తారతమ్యాలుండవు. మనుషులంతా సమానామే అన్న భావన బలంగా ఉన్న వ్యక్తిత్వాలున్నాయి. మనిషి ఒక్కడే అయినా వివిధ రకాల పనులను ఏక కాలంలో చేయగల సమర్థులు.పుణ్యం తప్ప పాపం తెలియని అమాయకపు మనస్తత్వాలు. కోటీశ్వరుడైనా..కటిక పేదకుడైనా! ఒళ్లోంచి పొద్దు కూకే వరకూ పనిచేయడం ఇక్కడ వాసులకు చెల్లిందంటున్నారు. ఇలాంటి మనస్తత్వాలు..వ్యక్తిత్వాల వల్లే ! కరోనా సోకలేదని ఆ రెండు జిల్లాల వాసులు బలంగా నమ్ముతున్నారు. ఆ విషయాలు పక్కనబెడితే విధిగా మాస్కులు ధరించడం.. సామాజిక దూరం పాటించడం..ఒకరు చెబితే ఓపిగ్గా విని అర్ధం చేసుకోవడం! వంటివి ఈ రెండు జిల్లాల ప్రత్యేకతగా చెబుతున్నారు. అందుకే మా జిల్లాల్లో వైరస్ భయం , బెంగ లేదంటూ ఉద్ఘాటిస్తున్నారు. ఏది ఏమైనా ఈ రెండు జిల్లాలు కరోనా మినహాయిపు జిల్లాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతికెక్కడం ఇప్పటివరకూ విశేషమే. ఇక ఈ రెండు జిల్లాల వాసుల ఆహారపు ఆలవాట్లు కూడా దేశ ప్రజలందరికంటే భిన్నంగానే ఉంటాయట. బలమైన పౌష్టికాహరం తీసుకోవడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత అట. ఆ కారణంగా ఇక్కడి ప్రజల్లోకి తొందరగా వైరస్ లు చొరబడవని అంటున్నారు. మొత్తానికి ఆ రెండు జిల్లాల వాసులు ప్రస్తుతానికైతే సేఫ్ జోన్ లోనే ఉన్నారు.