మెగా మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ తాజాగా `ఆహా` పేరుతో డిజిటల్ ప్లాట్ ఫామ్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌ల భారీ నుంచి గట్టి పోటీ వుంటుందని తెలిసినా దీని వెనక మైహోమ్ రామేశ్వరరావు, మ్యాంగో మ్యూజిక్ రామ్‌తో పాటు కోల్‌కొతాకు చెందిన కొంత మంది బిజినెస్ టైకూన్లని కూడా ఇందులో భాగస్వాములని చేపేశారు అల్లు అరవింద్. తెలుగు లోకల్ మార్కెట్‌పై అల్లు అరవింద్‌కు మంచి పట్టున్న విషయం తెలిసిందే. ఇదే `ఆహా` ఓటీటీకి పెద్ద ఎస్సెట్ అని చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ ఓటీటీకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా ముందుకు రావడం పట్ల అనుమానాలు రేకెత్తుతున్నాయి.
క్రేజీ హీరో ఏంటీ దీనికి ప్రచార కర్తగా మారడం ఏంటని ఆరాలు తీస్తున్నారు. మై హోమ్ అంటే కేటీఆర్ ఖచ్చితంగా వుంటారు. ఆయన షాడో భాగస్వామిగా వ్యవహరించినా ఆశ్చర్యంలేదు. ఆందుకే రౌడీని `ఆహా` ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టారని. ఇందులో రౌడీకి కూడా ఎంతో కొంత షేర్ వుండే అవకాశం లేకపోతేదని టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. అన్నట్టు ఈ యాప్ సబస్క్రిప్షన్ కోసం కేవలం ఏడాదికి 365 రూపాయలు మాత్రమే కోట్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లని దక్షిణాదిలో దెబ్బతీయడం కోసమే ఈ ప్రైజ్‌ని కోట్ చేశారని చెబుతున్నారు.