`ఆర్ ఆర్ ఆర్`… యావత్ దేశ వ్యాప్తంగా ఈ చిత్రం కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. ఇండియాలో 1920 సమయంలో బ్రిటీష్ సైన్యంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వీరుల కాలం నాటి కథగా ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా? అని చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర బృందం ఉగాది రోజున మూవీ లవర్స్‌కి సర్ప్రైజ్ గిఫ్ట్‌ని అందించింది. ఈ చిత్ర టైటిల్ లోగో మోషన్ పోస్టర్ని రిలీజ్ చేసింది. `ఆర్ ఆర్ ఆర్` ( రౌద్రం రణం రుథిరం) అనే పేరుని ఈ చిత్రానికి ఖరారు చేశారు. మోషన్ పోస్టర్లో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల పాత్రలు ఎంత శక్తిమంతంగా వుండబోతున్నాయో చెప్పేశాడు. ఒకరు బడబాగ్నిగా కనిపిస్తే మరొకరు ఉప్పెనగా ఉవ్వెత్తున ఎగిసిపడతారని అర్థం అవుతోంది.
ఈ టీజర్‌కు కీరవాణి అందించిన నేపథ్య సంగీతం, బీజియమ్స్ `బాహుబలి` నేపథ్య సంగీతాన్ని గుర్తు చేస్తూ రోమాంచితంగా సినిమా సాగుతుందనే సంకేతాల్ని అందిస్తోంది. బ్రిటీష్ ఇండియా కాలం నాటి స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
అలియాభట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరీస్, రే స్టీవెన్ సన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Water douses fire!
Fire evaporates water!
And the two forces come together with immense energy… to present the title logo of #RRR!!! #RRRMotionPoster – https://t.co/2Lm1db3VrL @tarak9999 #RamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891 #RRRMovie— rajamouli ss (@ssrajamouli) March 25, 2020