ఆమె స్కెచ్ వల్లే బిగ్ బాస్ 2 నుండి వచ్చేశా -యాంకర్ శ్యామల

బిగ్ బాస్ 2 లో ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుండి బయటకు వచ్చేశారు యాంకర్ శ్యామల. తన రొటీన్ లైఫ్ లోకి ఎంటర్ అయి కొడుకుతో సరదాగా గడుపుతున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 2 విషయాలు తెలుసుకోటానికి కొన్ని చానెళ్లు ఆవిడని చుట్టూ ముట్టేశాయి. వాటికి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్న శ్యామల ఫేస్బుక్ లైవ్ ద్వారా తన ఫాలోయర్స్ తో కొద్దిసేపు ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అప్పుడే హౌస్ నుండి బయటకు వచేసినందుకు శ్యామలకు బాధగా ఉందట. ఇంకా తన గురించి ప్రజలకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయట. తనని తాను నిరూపించుకోడానికి సరైన అవకాశం రాలేదని తెలిపింది. ఇంకా కొన్ని రోజులు హౌస్ లోనే ఉంటే తానేంటో నిరూపించుకునే సరైన టాస్క్ వచ్చి ఉండేదేమో అనే ఆశాభావం వ్యక్తం చేసింది.

నేను ఎలిమినేట్ అవటానికి కారణం తేజస్వి. నాకు వ్యతిరేకంగా ఆమె వేసిన స్కెచ్చుల వలనే నేను హౌస్ నుండి బయటకు రావాల్సి వచ్చింది. కానీ మసాలా విషయాల్లో ఇన్వాల్వ్ అవడం ఇష్టం లేక సైలెంట్ గా ఉన్నాను. నాకు ఓట్లు పడకుండా వ్యతిరేకత వచ్చేలా తేజస్వి చేసిన కుట్ర వల్లే తొందరగా ఎలిమినేట్ అయ్యాను అని బాధ పడింది. బిగ్ బాస్ షో యాజమాన్యం ఇచ్చే డబ్బు కోసమే సంవత్సరంలోపు బిడ్డను వదిలేసి వెళ్ళారా అని ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు కొంచెం కోపంగా రియాక్ట్ ఐంది శ్యామల. అలాంటిదేమి లేదని, తన భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే వెళ్లానని చెప్పుకొచ్చింది. అయితే తేజస్విపై శ్యామల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.