Spy Movie Review : “స్పై”మూవీ రివ్యూ అలరించే యాక్షన్ డ్రామా !

(చిత్రం : ‘స్పై’, విడుదల : జూన్ 29, 2023, రేటింగ్ : 2.75/5, నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, సాన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, రానా దగ్గుబాటి, తదితరులు. దర్శకత్వం: గ్యారీ బి హెచ్, నిర్మాత: కె రాజశేఖర్ రెడ్డి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్)

నిఖిల్ సిద్దార్థ కథానాయకుడిగా గ్యారీ బి హెచ్ దర్శకత్వంలో వచ్చిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘స్పై’. ఎన్నో అంచనాలతో జూన్ 29, 2023న ప్రేక్షకులముందుకొచ్చిన ఈ చిత్రం నిఖిల్ సిద్దార్థ కు ఎలాంటి క్రేజ్ ని తెచ్చిపెట్టింది? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింధో తెలుసుకుందాం..

కథ: అండర్ కవర్ ఏజెంట్ విజయ్ (నిఖిల్) . తన అన్న ఏజెంట్ సుభాష్ (ఆర్యన్ రాజేష్) ని ఎవరు చంపారో తెల్సుకోవాలని ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో విజయ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఖాదిర్ ఖాన్ , అతను చేసే మారణహోమాన్ని అడ్డుకొని, అతడిని ఇండియా ప్రభుత్వానికి అప్పచెప్పే మిషన్ విజయ్ కి వస్తోంది. తన అన్నయ్య సుభాష్ కూడా ఈ మిషన్ లోనే పాల్గొని చనిపోయాడని తెలుస్తోంది. ఇంతకీ సుభాష్ ని ఎవరు చంపారు ?, అలాగే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి సంబంధించి మిస్ అయిన ముఖ్యమైన ఫైల్ ఏమిటి?, విజయ్ తన టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేశాడా? లేదా ? అనేది కథ.

విశ్లేషణ ; సినిమాలో తీసుకున్న మెయిన్ పాయింట్ బాగున్నా.. ఈ స్పై లో పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యూలర్ మరీ లాజిక్స్ లేకుండా సాగడం ఈ సినిమాకి కొత్త మైనస్ అయ్యాయి. అదేవిదంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక ఖాదీర్ ఖాన్ అనే టెర్రరిస్ట్ చుట్టే కథను మొత్తం చుట్టేయడం..అలాగే సినిమాలో చైనా – ఇండియా మధ్య జరిగే అటాక్ సీన్స్ కూడా ఏమీ బాగాలేదు. నిజానికి సినిమాలో కొన్ని సోషల్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో చాలా చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రస్ట్ అంశాలు ఉన్నప్పటికీ.. నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తోంది. సినిమాలో ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ పై ఎక్కువ వర్క్ చేయాల్సింది. పైగా హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ డ్రామాను ఇంకా బలంగా రాసుకోవాల్సింది. అయితే,, తన గత చిత్రాల కంటే భిన్నంగా ఉగ్రవాద నేపథ్యంలో ఈసారి యాక్షన్ మైండ్ గేమ్ డ్రామాతో స్పై గా వచ్చాడు నిఖిల్ సిద్ధార్థ్ . ఈ సినిమాలో నిఖిల్ తన లుక్స్ లో అండ్ యాక్షన్ లో ఫ్రెష్ నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా రా ఏజెంట్ గా నిఖిల్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఐశ్వర్య మీనన్ తో నడిచే ప్రేమ సన్నివేశాలు మరియు కొన్ని సీన్స్ లో వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంటుంది. రచయిత కె రాజశేఖర్ రెడ్డి రాసుకున్న మెయిన్ పాయింట్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. నిఖిల్ – అభినవ్ గోమఠంకి మధ్య వచ్చే కొన్ని పంచ్ లు కూడా కొన్ని చోట్ల నవ్విస్తాయి. హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ అలరించింది. విలన్ గా నటించిన జిషు సేన్ గుప్తాతో పాటు సాన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. అతిధి పాత్రలో రానా దగ్గుబాటి మెప్పించాడు. మొత్తమ్మీద కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని ఎలిమెంట్స్ ఓకే అనిపిస్తాయి.

టెక్నీకల్ విషయాలకొస్తే… ద‌ర్శ‌కుడు గ్యారీ బి హెచ్ హిస్టారికల్ అంశాలకి ఉగ్రవాద అంశాలు కలిపి ఈ సినిమాని మలిచాడు. అయినప్పటికీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాను చూసిన ఫీలింగే వస్తుంది. అయితే దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సినిమాలో చాలా చోట్ల లాజిక్స్ మిస్ కాకుండా ఉండి ఉంటే.. సినిమా ఇంకా బాగుండేది. సంగీతం విషయానికి వస్తే.. పాట‌లు ఫర్వాలేదనిపిస్తే, నేప‌థ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్ర‌ఫర్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. సినిమాలోని నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. మొత్తం మీద ఎన్నోఅంచనాల మధ్య పక్కా యాక్షన్ డ్రామాతో స్పై గా వచ్చిన నిఖిల్, తన యాక్టింగ్ అండ్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. అయితే.. సినిమాలో సింపుల్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్ తో సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.

రేటింగ్ : 2.75/5