మిస్టర్ కళ్యాణ్ మూవీ రివ్యూ & రేటింగ్

ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈచిత్రంతో పండు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రానికి నిర్మాత సుబ్బారెడ్డి. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో తెలుసుకుందాం…

కథ: హీరో కళ్యాణ్ (కృష్ణ మాన్యం) ఒక కాల్ బాయ్. అలా అతని వృత్తిలో ఉన్న కళ్యాణ్ కు కొన్ని క్యారెక్టర్లు తారసపడతాయి. ఆ పాత్రలు కళ్యాణ్ తో కొన్ని ఎమోషన్స్ ను పంచుకుంటాయి. అదే సిటీలో చాపెల్ ( సప్తగిరి ) ఒక కార్పొరేట్ వ్యవస్థ పెట్టి కాల్ బాయ్ కంపెని రన్ చేస్తూ ఉంటాడు, ఈ క్రమంలో చాపెల్ తన కంపెనీలో జాన్ అవ్వమని కళ్యాణ్ ను రిక్వెస్ట్ చేస్తాడు. కానీ కళ్యాణ్ అతని మాట వినడు. కళ్యాణ్ కాల్ బాయ్ గా చేస్తున్న ఒకానొక సందర్భంలో తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి సారిక (అర్చన) కు దొరికిపోతాడు. ఆ తరువాత సారిక కళ్యాణ్ ను ఎలా ట్రీట్ చేసింది ? కళ్యాణ్ మరియు చాపెల్ చివరికి ఏమయ్యారు ? అసలు కళ్యాణ్ కాల్ బాయ్ గా ఎందుకు మారాడు వంటి విషయాలు తెలియాలంటే మిస్టర్ కళ్యాణ్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: మిస్టర్ కళ్యాణ్ సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా సాగుతుంది. సప్తగిరి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. సప్తగిరి కి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ పాత్రల్లో నటించిన ధనరాజ్, బాబీ వారి పాత్రల్లో బాగా నటించి మెప్పించారు. హీరోయిన్ అర్చన బాగా నటించింది, సారిక పాత్రలో ఒదిగిపోయింది. హీరో ప్రయాణంలో తనకు పరిచయం అయిన నాలుగు పాత్రలు మనలోని ఎమోషన్స్ ను తట్టి లేపుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్ర్ తప్పకుండా కలుగుతుంది. సెకండ్ హాఫ్ హ్యూమన్ ఎమోషన్స్, బంధాలు వాటి విలువల గురించి అద్భుతంగా చూపించారు. దర్శకుడు పండు కు మిస్టర్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ మూవీ అయినప్పటికీ అనుభవం కలిగిన దర్శకుడిలా చేశాడు. తాను రాసుకున్న కథ కథనాలు తెర మీద చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు మొత్తం 5 పాటలను బాగా ఇచ్చాడు. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా చేశాడు. సాహిత్యం కూడా తనే ఇవ్వడం విశేషం. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ నిలబడ్డాడని చెపొచ్చు.

కెమెరామెన్ నానాజి మరియు ఎమ్.వి.గోపి వీరి పనితనం అద్భుతం వారి కెమెరా వర్క్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్లిందని చెప్పక తప్పదు. డైరెక్టర్ పండు, కెమెరామెన్స్ నానాజి మరియు ఎమ్.వి.గోపి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ కొత్తవల్లే అయినప్పటికీ అనుభవం కలిగిన టెక్నిషన్స్ లా చేసి మిసర్ట్ కళ్యాణ్ సినిమాను నిలబెట్టారు. ఎడిటర్ వినోద్ అద్వయ్ సినిమాను చాలా నీట్ గా కట్ చేశారు. అతని వర్క్ బాగుంది. ఈ సినిమాకు ఫైట్స్ బిగ్ ప్లస్, షావాలింన్ మల్లేష్ మాస్టర్ కంపోజ్ చేసిన నాలుగు ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి. అనిష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన నాలుగు పాటలు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో బాగా తీశారు. మాస్టర్ కొరియోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. నిర్మాత ఎన్. వి.సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మిస్టర్ కళ్యాణ్ సినిమాను నిర్మించారు. శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ లో వచ్చిన మొదటి సినిమా మిస్టర్ కళ్యాణ్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. అన్ని వర్గాల వారికి నచ్చే చాలా ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా చూస్తే నిర్మాత ఎన్. వి. సుబ్బారెడ్డి అభిరుచి స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి మంచి కథ బలం ఉన్న సినిమాలు నిర్మాత తీయాలని కోరుకుందాం. వినోదం తో పాటు ఎమోషన్స్, వాల్యూస్, మెసేజ్ ఈ సినిమాలో బాగున్నాయి.

చివరిగా: మిస్టర్ కళ్యాణ్ అందరిని ఆకట్టుకుంటాడు

రేటింగ్: 3/5

(చిత్రం : మిస్టర్ కళ్యాణ్, విడుదల తేది: మార్చి 10, 2023, నటీనటులు: కృష్ణ మాన్యం, అర్చన, సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్, రాజ్ వర తదితరులు, దర్శకత్వం : పండు, నిర్మాత: ఎన్. వి. సుబ్బారెడ్డి, సంగీతం: సుక్కు, సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి, ఎడిటర్: వినోద్ అద్వయ్, డాన్స్: అనీష్, ఫైట్స్: మల్లేష్)