నటీనటులు : సునీల్, ధనరాజ్, చాందిని తమిళరసన్, శ్రీకాంత్ అయ్యంగార్, తదితరులు
దర్శకత్వం : గరుడవేగ అంజి
నిర్మాతలు: అగ్రహారం నాగి రెడ్డి, ఎన్. సంజీవ రెడ్డి
సంగీత దర్శకుడు: సాయి కార్తీక్
కమెడియన్ గా పీక్ టైం లో ఉండగానే సునీల్ కామెడీ రొలెస్ కి స్వస్తి చెప్పి, హీరో గా తన లక్ ఒక దశాబ్ద కాలం పైగా చెక్ చేసుకున్నాడు. ఒక్కటి, రెండు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవి హీరోగా. ఈలోగా సునీల్ ప్లేస్ ని వెన్నెల కిషోర్ ఆక్రమించేసాడు. ఇంకా హీరోగా ఆశలు వదులుకున్న సునీల్ ఈ మధ్య మళ్ళీ కమెడియన్ గా, విలన్ గా బిజీ అవుతున్నాడు. అప్పుడప్పుడు హీరో గా కూడా చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘పండుగాడు’ తర్వాత మళ్ళీ బుజ్జి ఇలా రా సినిమా తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ:
మన సినిమా కథ వరంగల్ లో మొదలవుతుంది. ఆ ఏరియా లో అందర్నీ భయానికి గురి చేస్తూ కొన్ని సీరియల్ మర్డర్, కిడ్నాప్ లు జరుగుతూ ఉంటాయి. అన్ని కేసులు ఎలా వున్నా కానీ, ఓ ఎనిమిదేళ్ల పాప కి సంబంధించిన కేసు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది.
మరో పక్క పక్క ఈ కిడ్నప్ అండ్ మర్డర్ అయ్యిన శరీరాల్లో గుండె మిస్సవ్వడం అనేది ఇంతకీ వీడని మిస్టరీగా కనిపిస్తుంది. ఈ కేసు అప్పుడే సీఐ గా ఛార్జ్ తీసుకున్న కేశవ(ధనరాజ్) కి వస్తుంది. మరి తాను ఈ కేసును సాల్వ్ చేశాడా? ఇంతకీ ఈ దారుణాలు చేస్తుంది ఎవరు? ఈ సినిమాలో ఖయ్యుమ్(సునీల్) కి ఉన్న పాత్ర ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల్లో కొంతమందికి చిన్న సినిమాలు పట్ల కొంచెం నెగిటివ్ థింకింగ్ ఉండొచ్చు కానీ ఈ సినిమా మాత్రం అలాంటి వాళ్ళకి మంచి ఆన్సర్ అని చెప్పొచ్చు. థ్రిల్లింగ్ అంశాలు తో పాటు ఈ సినిమాలో నోవాల్టీ ఆకట్టుకుంటుంది.
కొన్ని సీన్స్ లో డీటెయిల్స్, విజువల్స్ బాగున్నాయి. ఇక అలాగే మెయిన్ కాస్ట్ లో కనిపించిన సునీల్ ధనరాజ్ లు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు.
మైనస్ పాయింట్స్ :
సినిమా మెయిన్ పాయింట్ లోకి తీసుకెళ్ళేవరకు బోర్ ఫీల్ ఆడియెన్స్ కి తప్పదు. ఇంకా కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి.
సినిమాలో వైలెన్స్ కూడా కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది అందరికీ అంత నచ్చకపోవచ్చు.
తీర్పు :
ఓవరాల్ గా చూసినట్టు అయితే ఈ “బుజ్జి ఇలా రా” చిత్రం ఒక డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్. నటీనటుల మంచి పెర్ఫామెన్స్ లు అలాగే కొన్ని థ్రిల్ చేసే అంశాలు ఆకట్టుకుంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో నెమ్మదిగా సాగడం కొన్ని సీన్స్ లో పట్టు లేకపోవడం బలహీనమైన ఇతర కాస్టింగ్ వంటివి మాత్రం ఆడియెన్స్ లో ఆసక్తిని తగ్గిస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఒక థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఒకసారి ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది.