వైఎస్ షర్మిల ‘కొ..’ విమర్శల్ని ‘ఏపీ వైపు’ డైవర్ట్ చేస్తున్నదెవరు.!

తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేని, ‘కొ..’ అంటూ వైఎస్ షర్మిల విమర్శించిన సంగతి తెలిసిందే. ఆమె అలా విమర్శించడానికి కారణం తెలంగాణలోని సదరు అధికార పార్టీ ఎమ్మెల్యేనే ముందుగా షర్మిల మీద ఆ కామెంట్స్ చేశారు. అయితే, షర్మిల కాస్త సంయమనం పాటించి వుండాల్సింది. రాజకీయాల్లో మాటకు మాట.. మామూలే అయినా, ఆ మాట హద్దు దాటకూడదు. ఓ పార్టీ అధినేత్రిగా వైఎస్ షర్మిల సంయమనం పాటించి వుండేది. పైగా, తాను చేసే ప్రతి విమర్శా.. ఖచ్చితంగా ట్విస్ట్ చేయబడుతుందని ఆమె గుర్తించి వుండాలి.

పెద్ద నస్టమే జరిగిపోయింది. ఇన్నాళ్ళూ షర్మిల సాధించుకున్న ఇమేజ్ ఒక్క దెబ్బతో నాశనమైపోయింది. పైగా, ఏపీ రాజకీయాలపైనా ఈ వ్యాఖ్యల ప్రభావం గట్టిగా పడింది. ‘మీ జగన్ మోహన్ రెడ్డినే అంటోంది ఆయనగారి చెల్లెలు’ అంటూ గులాబీ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో షర్మిల మాటల్ని డైవర్ట్ చేస్తున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఎడిటెడ్ వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. దాంతో, వాటికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వైసీపీకి వస్తోంది. ‘షర్మిల రాజకీయాలతో మాకేంటి సంబంధం.?’ అని పైకి వైసీపీ నేతలు చెబుతున్నా, కింది స్థాయిలో పరిస్థితులు వేరేలా వున్నాయ్.

‘షర్మిల తెలంగాణలో కాకుండా, ఏపీలో పార్టీ పెడితే బావుండేది..’ అంటూ వైసీపీ అంటే గిట్టని నెటిజన్లు, షర్మిల విమర్శల్ని వైసీపీ మీదకు టర్న్ చేస్తూ కామెంట్లేస్తున్నారు.