రాంగ్ ట్రాక్‌లో వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయం.!

అధికారంలో వుంటే, వ్యవస్థల్ని ఎలా వాడతారో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకి తెలియదా.? పైగా, పక్కనే పొరుగు రాష్ట్రంలో అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కూడా ఆమె చూస్తూనే వుంటోంది కదా.! అక్కడ కోర్టులు పోలీసు వ్యవస్థకు తలంటు పోస్తున్న వైనం షర్మిలకి తెలియదని ఎలా అనుకోగలం.?

సరే, రాజకీయాల్లో ఏ పార్టీకి ఆ పార్టీ కొన్ని వ్యూహాలు రచించుకుంటుంది. వైఎస్ షర్మిల కూడా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రిగా తనదైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. అయితే, ఒక్కో కార్యక్రమం ద్వారా పార్టీకి ఎంత లాభం చేకూరుతోంది.? అన్నది కూడా ఆమె ఆలోచించుకోవాలి.

పోలీసులపై దాడి ఘటనతో వైఎస్ షర్మిల పొందిన రాజకీయ లబ్ది కంటే, కోల్పోయిన పాపులారిటీనే ఎక్కువ. అయినా, ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా రాజకీయాలు చేయాల్సిన షర్మిల, హైద్రాబాద్ వేదికగా చేస్తున్న ఈ అనవసరపు హంగామా ఎందుకు.? ఈ ఏడాదిలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. పార్టీ తరఫున వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి…