సీనియర్ కాంగ్రెస్ నేత, ఎఐసిసి కార్యదర్శి మధు యాష్కీ గౌడ్ ప్రగతి నివేదన సభ తీరుతెన్నులపై ఫైర్ అయ్యారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మధు యాష్కీ ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి.
ప్రగతి నివేదన సభ పగటి దొంగల నివేదిక సభలా ఉంది. కేసీఆర్ నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు. అట్టడుగు వర్గాల కు ప్రగతి భవన్ లో అధికారం కావాలి. బీసీలకు గొర్లు, బర్లు, నల్లా నీళ్లు కాదు… పరిపాలనలో రాజ్యాధికారం కావాలి. బీసీలను కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారు. తెలంగాణాలో అహంకారం తో కేసీఆర్ దొర పాలన చేస్తున్నారు.
మోడీకి గులాం చేస్తుంది కేసీఆర్. మోడీని చూస్తే కేసీఆర్ లాగు తడుస్తుంది. జోన్ ల విషయంలో మోడీని ఇస్తావా చస్తావా అన్న కేసీఆర్ ..విభజన హామీలపై ఎందుకు అడగలేదు.? నిజంగా కేసీఆర్ కు దైర్యం ఉంటె ముస్లిం రిజర్వేషన్ లపై మోడీని ఎందుకు అడగలేదు ? ప్రగతి నివేదన సభకు ఖర్చు చేసిన మూడు వందల కోట్లు కేసీఆర్ కు ఎలా వచ్చాయి .? పది పర్సెంట్ కమిషన్ 30శాతం వాటాలతో కేసీఆర్ పాలన సాగుతున్నది.
కేసీఆర్ కుటుంబ అవినీతి, కమిషన్ ల బాగోతం పై ఈడీ, సీబీఐ కి పిర్యాదు చేస్తాం. జాతీయ రహదారిని అడ్డుగోలుగా తవ్వేసే అధికారం నీకెక్కడిది .? కేసీఆర్ కు దమ్ముంటే అమరవీరులకు చేసిన సహాయం పై గన్ పార్క్ దగ్గర చర్చకు వస్తావా .? కొండా లక్ష్మణ్ బాపూజీ, దేశిని చిన మల్లయ్య లాంటి వారి పేర్లు పలికే అర్హత కేసీఆర్ కు ఎక్కడ ఉంది.? ఎన్నికలు తొందరగా వస్తే కేసీఆర్ పాపాత్ముడి పాలన పోతుందని జనం చూస్తున్నారు. కేసీఆర్ ను రాజకీయంగా బొందపెడతారు.
ఢిల్లీ అవసరం లేకపోతే కేసీఆర్ ..ఎందుకు మోడీకి గులాం చేస్తూ సలాం లు కొడుతున్నారు. కేసీఆర్ నాలుగేళ్లుగా పేదలకు కట్టింది మూడువందల ఇండ్లు మాత్రమే. కేసీఆర్ మూడు తరాలు పోయినా పేదలకు డబుల్ బెడ్ రూమ్ రావు. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ కు నోబుల్ బహుమతి ఇవ్వొచ్చు. టీఆరెస్ పెట్టినప్పుడు కేసీఆర్ ఆస్తులు ఎంత ..ఇప్పుడు ఎంత ..?