మందుబాబులకి తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్ .. ఏంటంటే !

తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 న మద్యం దుకాణాల మూసివేత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం సందర్భంగా అదనంగా మరో గంటపాటు ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనితో ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచే అవకాశం ఉండేంది.

Telangana Beverages Corporation goes online

న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే , క్లబ్, బార్లకు కూడా టైమింగ్ పెంచింది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతినిచ్చింది. అయితే, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని వెల్లడించింది.

ఇక మరోవైపు పోలీసులు కూడా మద్యం సేవించి రోడ్డెక్కే వాహనదారుల తాట తీసేందుకు పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తాగి వాహనం నడిపితే కఠినంగా శిక్షిస్తామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. తాగి బండి నడిపితే మొదటిసారి పట్టుబడితే..రూ. 10 వేలు ఫైన్, ఆరు నెలల జైలు శిక్ష, మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు ప్రకటించారు. ఇక రెండోసారి పట్టుబడితే..రూ. 15 వేలు జరిమాన, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.