బుల్లితెరపై తళుక్కున్న మెరిసిన అందం వర్షిణి. యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరిస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వర్షిణి.. బుల్లితెరపై మంచి గుర్తింపును సంపాదించుకుంది. మొదట్లో వర్షిణిపై బాగానే ట్రోల్స్ వచ్చాయి. కానీ రాను రాను మాత్రం వర్షిణిపై మంచి ఇమేజ్ ఏర్పడింది. ఒకప్పటి వర్షిణికి ఇప్పుడున్న వర్షిణికి ఎంతో తేడా ఉంది. ఒకానొకప్పుడు వర్షిణికి డ్యాన్సులు వేయడం, తిరిగి కౌంటర్లు వేయడం వచ్చేవి కాదు.
ఇప్పుడు మాత్రం ఆది, సుధీర్ వంటివాళ్లనే ఓ ఆట ఆడేసుకుంటోంది. వర్షిణి బుల్లితెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటుందో.. సోషల్ మీడియాలోనూ అంతే రచ్చ చేస్తుంటుంది. మామూలుగా వర్షిణి సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ విషయాలనే ఎక్కువగా పంచుకుంటుంది. తన అమ్మ, అక్క, వాళ్ల ఫ్యామిలీ ఇలాంటి విషయాలను చెబుతూ ఉంటుంది. ప్రస్తుతం వర్షిణి తన ఫ్యామిలీతో కలిసి గోవాలో రచ్చ చేస్తున్నట్టుంది.
న్యూ ఇయర్ పార్టీ కోసం అందరూ గోవాకే వెళ్లారు. అదే క్రమంలో వర్షిణి కూడా తన ఫ్యామిలీని గోవాకు తీసుకెళ్లినట్టుంది. అయితే ఇంకా కూడా వర్షిణి పార్టీ మూడ్‌లొనే ఉన్నట్టుంది. ఎందుకంటే ఇంకా బీచ్‌ను చూస్తూ అందులో ఆడుకుంటూ బిజీగా ఉంది. పొట్టి డ్రెస్ వేసుకుని అలా బీచ్‌లో నిలబడి సముద్రాన్ని చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.