షర్మిలకు ఆశించిన స్థాయిలో క్రేజ్ వచ్చిందా?

తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకొని పార్టీని అధికారంలోకి తీసుకొనిరావాలని భావించిన షర్మిలకు ఇప్పటివరకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. రాష్ట్రంలో ప్రజలు తనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆమెను బాధ పెట్టింది. పార్టీలో ప్రాధాన్యత ఉన్న నేతలు లేకపోవడంతో షర్మిలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా షర్మిల ధ్వంసమైన కారుతో నిరసన వ్యక్తం చేశారు.

ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల ప్రయత్నించగా పోలీసులు షర్మిలను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే షర్మిలను అరెస్ట్ చేయడంతో జగన్ హైదరాబాద్ కు వస్తున్నారని సమాచారం. షర్మిలకు జగన్ పరోక్షంగా మద్దతు ఇచ్చినా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరంగా వేగంగా మార్పులు వస్తాయని చెప్పవచ్చు. జగన్ మద్దతు ఇస్తే వైఎస్సార్టీపీ పార్టీలోకి రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

మరోవైపు అరెస్ట్ కావడంతో షర్మిల మైలేజ్ పెరిగింది. షర్మిలకు లేడీస్ సపోర్ట్ లభించినా ఆమె కెరీర్ కచ్చితంగా పుంజుకుంటుందని చెప్పవచ్చు. షర్మిల తనదైన శైలిలో వ్యూహాలను సిద్ధం చేసుకుని ప్రజలకు దగ్గరైతే మంచిదని చెప్పవచ్చు. షర్మిల ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలను బట్టి ఆమె పొలిటికల్ కెరీర్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది.

వైఎస్సార్టీపీ కూడా రాష్ట్రంలో పుంజుకుని ఇతర పార్టీలకు షాకిస్తుందేమో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో వైఎస్సార్టీపీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. తండ్రి, సోదరుడి ఇమేజ్ తో షర్మిల రాజకీయాల్లో ఏం చేస్తారో చూడాల్సి ఉంది.