తండ్రి భరోసా: నేనున్నాననీ… నీకేం కాదని!

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరుకావాలంటూ కవితకు ఈడీ నోటీసులు అందించడం.. ఇప్పుడు రాలేను మార్చి 15తర్వాత వస్తాను అని కవిత లేఖ రాయడం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కవిత శంషాబాద్ ఎయిర్‌ పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరారు. అయితే ఎయిర్ పోర్టుకు వెళ్లేముందు ప్రగతి భవన్‌ కు వెళ్లి.. తన తండ్రి కేసీఆర్‌ తో భేటీ అవ్వాలని భావించారు. కానీ.. సమయం లేకపోవడంతో కూతురితో ఫోన్ లోనే మాట్లాడిన కేసీఆర్.. ధైర్యం చెప్పారని తెలుస్తుంది! అనంతరం కవిత హస్తిన  పయనమయ్యారట!

ఈ సందర్భంగా సుమారు 15 నిమిషాలపాటు కూతురు కవితతో మాట్లాడిన కేసీఆర్… “ఢిల్లీలో నువ్వు చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమం ఆపకుండా కొనసాగించు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. న్యాయపరంగా బీజేపీ ఆకృతాలపై పోరాడుదాం. పార్టీ నీకు ఎప్పుడూ అండగా ఉంటుంది.” అని చెప్పారంట. దీంతోపాటు ఫైన్ల్ గా.. “నేనున్నాను” అని అన్నారంట. ఇలా “నేనున్నాను – నీకేంకాదు” అంటూ తండ్రి ఇచ్చిన భరోసాతో కవిత ధైర్యంగా ఢిల్లీకి బయలుదేరారని అంటున్నారు!

ఇదే క్రమమంలో… కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో కవిత ఢిల్లీ వెళ్తున్నారని తెలుసుకున్న అనుచరులు, బీఆరెస్స్ కార్యకర్తలు ఆమెకు మరింత ధైర్యం ఇచ్చే ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు.”మేడమ్ ధైర్యంగా వెళ్లండి” అంటూ సాగనంపారు!

కాగా.. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే “మహిళా రిజర్వేషన్ బిల్లు”ను పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టి ఆమోదించాలని.. బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి నేతృత్వంలో “జంతర్ మంతర్” వద్ద ఒకరోజు నిరాహార దీక్షను కవిత తలపెట్టిన విషయం తెలిసిందే.

ఈ దీక్షను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించనుండగా.. దేశంలోని సుమారు 18 పార్టీలకు చెందిన నేతలు, ఆయా పార్టీల బృందాలు ఈ దీక్షలో పాల్గొననున్నాయి.