తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. కొత్త రెవెన్యూ చట్టం దిశగా అడుగులు వేస్తున్నది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసేందుకు ముందడుగు వేసింది.
ఇప్పటికే రెవెన్యూ చట్టంలో ఎన్నో లొసుగులు ఉన్నాయని.. వాటిని సరిచేయాలని సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. దాని కార్యచరణను ప్రభుత్వం ప్రారంభించింది.
కొత్త రెవెన్యూ చట్టం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే… వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. ప్రతి జిల్లా కలెక్టర్ సాయంత్రం లోగా రెవెన్యూ రికార్డులకు సంబంధించి సమగ్ర నివేదిక పంపించాలని సీఎస్ ఆదేశించారు. మధ్యాహ్నంలోగా వీఆర్వోలంతా తమవద్ద ఉన్న రెవెన్యూ రికార్డులను పై అధికారులకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
దీంతో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి.. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నదని తెలుస్తోంది. దీనికి సంబందించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.