తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎధురుచూస్తున్న వారికి టిఆర్ఎస్ సర్కారు తీపి కబురు అందించింది.
కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన కొద్ది గంటల్లోనే ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.
9355 పంచాయతీరాజ్ సెక్రటరీ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
నిరుద్యోగులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సెప్టెంబరు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబరు 10వ తేదీని ఆఖరు తేదీగా ప్రకటించింది.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు, అభ్యర్థుల అర్హత వివరాలు, పరీక్ష వివరాలు, ఫీజు వివరాలు, రిజర్వేషన్ల వివరాలన్నీ http://tspsri.cgg.gov.in లో పరిశీలించాలని సూచించింది.
కొత్త జిల్లాల వారీగానే ఈ పోస్టుల భర్తీ ఉంటుందని తెలిపింది. జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా నియామక ప్రక్రియ చేపట్టనుంది సర్కారు.