తెలంగాణ: రాష్ట్రంలో ప్రజలు అధికార ప్రభుత్వం మీద విసుగుతో బీజేపీ… బీజేపీ… బీజేపీ… అంటున్నారని, ఆ పార్టీ నేత విజయశాంతి నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని విమర్శలు చేశారు. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాములమ్మ మాట్లాడుతూ… తెలంగాణ బిడ్డగా ఈ రోజు రాష్ట్రాన్ని చూస్తుంటే నాకు కడుపు మండుతుంది అని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ టీఆర్ఎస్ తో ప్రజలకు ఏమి లాభం లేదు అని ఆమె వెల్లడించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ ను దోచుకుంటున్నారు అని ఆమె విమర్శలు చేసారు.
బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈ తెలంగాణ లో ప్రజలకు లాభం కలుగుతుంది అని ఆమె విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అని మండిపడ్డారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి అని ఆమె స్పష్టం చేసారు. తెలంగాణ ప్రజలకు ఎన్ని మాయ మాటలు చేప్పారో మనందరికీ తెలుసు అని ఆమె అన్నారు. ఎక్కడయితే కేసీఆర్ మోసం చేశాడో… ప్రతి సమస్య మీద యావత్తు తెలంగాణ ప్రజలు పోరాడాలి అని ఆమె పిలుపునిచ్చారు.
గతంలో కాంగ్రెస్, టీడీపీ, ఇప్పుడు టీఆర్ఎస్ పాలన చేసినా కానీ రాష్ట్రంలో ఎలాంటి మార్పు లేదు అని ఆమె పేర్కొన్నారు. మార్పు రావాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యం అని ఆమె స్పష్టం చేసారు. రోజు రోజుకి బీజేపీ పార్టీ ఒక శక్తివంతమైన పార్టీగా ఎదుగుతుందని ఆమె అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి రోజులు రానున్నాయని ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రజల కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుంది అని అన్నారు. రాబోయే బై ఎలక్షన్ లో బీజేపీ కార్యకర్తలు బాగా కష్టపడాల్సిన అవసరం ఎంతో ఉంది అని ఆమె అన్నారు.