కేసిఆర్ సర్వేలపై పిసిసి ఉత్తమ్ అదిరిపోయే పంచ్

తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని సందర్భాల్లో ఆచితూచి మాట్లాడుతారు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం గట్టిగానే మాటల తూటాలు పేలుస్తారు. తాజాగా కేసిఆర్ సర్వే ఫలితాల పేరుతో చేసిన హడావిడిపై సూపర్ జోక్ వదిలారు ఉత్తమ్. గాంధీభనవ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ఆ వివరాలు చదవండి.

టీచర్స్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పట్ల ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో పనిచేస్తున్న సుమారు నాలుగు లక్షల ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. నాలుగేళ్లుగా ఒక్కసారి కూడా ఉపాధ్యాయులకు కేసీఆర్ అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోవడం మరీ దారుణంగా ఉంది.  ఈ రకంగా చూస్తే టీచర్ల విషయంలోనూ కేసిఆర్ మరో రికార్డు నెలకొల్పారని అర్థమైతున్నది. ఉద్యోగులకు జూన్ రెండున ఐఆర్ ఇస్తానన్న సీఎం చెప్పిన మాట ఎటుపోయింది? ఆర్టీసీ కార్మికులకు కి పదహారు శాతం కాకుండా 25శాతం ఐఆర్ ఇవ్వాలి. ఉద్యోగుల ఖర్మ కాండలకు 11 రోజుల సెలవులు ఇవ్వాలి. ఎయిడెడ్, రెసిడెన్సియల్ టీచర్ల కు జీరో ఒన్ జీరో ప్రకారం వేతనాలు
ఇవ్వాలి. వచ్చే మా ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి పాత పద్ధతినే అమలు చేస్తుంది. జీవో 28తో కొత్త పెన్షన్ ను అమలు చేసి కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు నష్టం చేస్తున్నది.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. వంద సీట్లు గెలుస్తామంటూ కేసీఆర్ మజాక్ చేస్తున్నారు. కేసీఆర్ చేయించిన సర్వేలు  తెలంగాణలో కాకుండా వేరో రాష్ట్రంలో చేసినవి అనుకుంటా. కానీ మా సర్వేలు తెలంగాణలో చేయించాము. వచ్చే ఎన్నికల్లో మేము 75 సీట్లు గెలవడం ఖాయం.  ఎన్నికలు డిసెంబర్ లో వచ్చినా, తర్వాత వచ్చినా గెలుపు మాదే.