మునుగోడు ఉపఎన్నికలో ఎవరూ ఊహించని ఫలితం రాబోతుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ఈ ఏడాదే మునుగోడు ఉపఎన్నిక జరగవచ్చని తెలుస్తోంది. అయితే రోజురోజుకు మునుగోడులో పరిస్థితులు మారుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో మళ్లీ ఆయనే బీజేపీ తరపున పోటీ చేసి గెలుస్తారని అందరూ భావిస్తున్నారు.
అయితే ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకే అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కేసీఆర్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు టీ.ఆర్.ఎస్ కచ్చితంగా గెలిచేలా జాగ్రత్త పడుతున్నారు. టీ.ఆర్.ఎస్ ఎన్నికల్లో గెలుపు కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి సిద్ధమైందని తెలుస్తోంది. బీజేపీ నేతలకు సైతం గెలుపు విషయంలో క్రమంగా ఆశలు సన్నగిల్లుతున్నాయని ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అనుకూల ఫలితాలు రావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా పుంజుకోవడం తేలిక కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికల ఫలితాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీ.ఆర్.ఎస్ నేతలు పార్టీని గెలిపించుకోవడానికి తమ వంతు కష్టపడుతున్నారు.
మునుగోడు ఉపఎన్నిక మాత్రం గడిచిన పదేళ్లలో జరిగిన ఖరీదైన ఉపఎన్నికలలో ఒకటని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీ.ఆర్.ఎస్ కు అనుకూల ఫలితాలు రానున్నాయని తెలుస్తోంది. బీజేపీ తెలంగాణలో క్రమంగా పుంజుకుంటున్నా బలమైన అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అవుతోంది.