టిఆర్ఎస్ గాదరి కిశోర్ ను బూతులు తిట్టిన మహిళ (వీడియో)

తెలంగాణలో ఎన్నికల వేళ ఎక్కడ చూసినా బూతు పంచాంగాలే చెవులకు వినబడుతున్నాయి. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు తిట్ల దండకంలో. ఆయనతో మిగతా పార్టీల నేతలు కూడా పోటీ పడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసిఆర్ మాత్రం నోటికి పని చెప్పి చంద్రబాబును, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ముత్క కూతలు అందుకుని తిడుతున్నారు. 

ఏడ బహిరంగసభ పెట్టినా కేసిఆర్ నోటికి పనిచెబుతూ విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. కేసిఆర్ స్వయంగా బూతుపురాణాలు వినిపిస్తూ ఉండడంతో ఆ పార్టీలో ఉన్న లీడర్లు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న నల్లగొండలో జరిగిన సభలో మాట్లాడిన తుంగతూర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ నోటికి పని చెప్పారు. రాయలేని గలీజు భాషలో ఆయన కాంగ్రెస్ నేతలను తిట్టి పారేశారు.

తుంగతూర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్

ఇక నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు మిగతా పార్టీల వారు కూడా అదే స్థాయిలో టిఆర్ఎస్ మీద విరుచుకుపడుతున్నారు. వారే కాదు జనాలు కూడా అదే భాషలో టిఆర్ఎస్ నేతలకు తిట్ట రుచి చూపిస్తున్నారు. విపక్షాలు తిడితే ఏదో అడ్జెస్టు కావొచ్చు కానీ జనాలు కూడా కసిగా టిఆర్ఎస్ నేతలను తిట్టడంతో వారు దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడుతున్నారు.

తాజాగా సూర్యాపేట జిల్లా తుంగతూర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం లో ఒక మహిళ స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ను బూతులు తిట్టారు. స్థానిక ఎర్రకుంట లో బతుకమ్మలు ఆడే ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించలేదని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పై ఆగ్రహాం వ్యక్తం చేసిన మహిళ. బతుకమ్మకు సౌకర్యాలు కల్పించలేని నాయకుడు కిశోర్ ఏం పీకుతున్నాడంటూ తిట్ల దండకం ఎత్తుకున్నారు. బతుకమ్మ పేరు చెప్పుకుని రాజ్యాలేలుతారా? అని నిలదీశారు.  ఆమె ఇంకా ఏం మాటలు తిట్టారో కింద వీడియో ఉంది మీరే చూడండి.

 

women fire on trs ex mla gadari kishor