అందుబాటులో గ్రూపు 4 హాల్ టికెట్లు, సగం మంది దరఖాస్తుల తిరస్కరణ

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టులతో పాటు టిఎస్ ఆర్టీసీలోని జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, జీహెచ్ ఎంసీలో బిల్ కలెక్టర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్ టికెట్లను వెబ్ సైటులో పొందు పరిచినట్టు టిఎస్ పీఎస్సీ వెల్లడించింది. మంగళవారం నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. 3 పోస్టులకు దరఖాస్తులు వేరైనప్పటికి పరీక్ష మాత్రం అందరికి కలిపి నిర్వహిస్తున్నట్టు టిఎస్ పీఎస్పీ తెలిపింది.

టిఎస్ పీఎస్సీ హాల్ టికెట్ల డౌన్ లోడ్ లో అభ్యర్దులకు తిప్పలు ఎదురవుతున్నాయి. చాలా మంది అభ్యర్ధుల దరఖాస్తులను టిఎస్ పీఎస్సీ తిరస్కరించింది. అప్లికేషన్ తీసుకునేటప్పుడు సక్సెస్ అని వచ్చి ఇప్పుడు హాల్ టికెట్ డౌన్ లోడ్ కాకపోవడం పై అభ్యర్ధులు దుమ్మెత్తిపోస్తున్నారు. హాల్ టికెట్స్ డౌన్ చేసుకుందామని ఓపెన్ చేస్తే యూవర్ క్యాండిడేచర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని చాలా మందికి చూపిస్తుంది. దీంతో అభ్యర్దులు బిత్తరపోయి చూస్తున్నారు. ఇన్ని రోజులు కష్టపడి చదివితే ఇప్పుడు హాల్ టికెట్ రాకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఫీజు పే, అప్లికేషన్ ప్రాసెస్ సక్సెస్ అని వచ్చి ఇప్పుడు ఇలా అయ్యే సారికి వారంతా షాక్ కు గురవుతున్నారు. 

టిెఎస్ పీఎస్సీ ఆది నుంచి వివాదాల మయమే అవుతోంది. ఏ పరీక్ష కూడా సక్కగా నిర్వహించిన దాఖలాలు లేదని నిరుద్యోగులు అంటున్నారు. అసలు విద్యార్దులకు ఈ కఠిన పరీక్ష ఏందని, జీవితాలు అంటే తమాషాగా ఉందా అని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 పరీక్షలకు సపరేట్ గా అప్లికేషన్లు తీసుకొని ఇప్పుడు హాల్ టికెట్స్ ఎందుకు జారీ చేయరన్నారు. అసలు మూడింటికి వేరుగా పరీక్ష పెట్టాలి కానీ చేతకానీ తనంతో ఇలా చేస్తారా అని విమర్శించారు. వెంటనే అప్లై చేసుకున్న అందరికి హాల్ టికెట్స్ జారీ చేయాలని వారు డిమాండ్  చేశారు.

టిఎస్ పీఎస్సీ చేతకానీ తనం వల్ల తమ జీవితాలు ఆగం అవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సమస్య ఏంటో తెలుసుకోని వెంటనే అభ్యర్దులందరికి హాల్ టికెట్స్ మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ సక్సెస్ అయ్యిన తర్వాత ఇప్పుడెందుకు హాల్ టికెట్స్ రావని వారు ప్రశ్నిస్తున్నారు. అభ్యర్ధులకు కనీస సమాచారం లేకుండా నేరుగా హాల్ టికెట్స్ రావని చెబితే పరిస్థితేంటని వారు విరుచుకుపడుతున్నారు. వెంటనే సమస్య పరిష్కరించి హాల్ టికెట్స్ జారీ చేయాలని లేకపోతే ఉద్యమం చేస్తామని ఓయూ నేతలు, నిరుద్యోగ సంఘాలు టిఎస్ పీస్సీని హెచ్చరించారు.