కెసియార్ ను ధిక్కరిస్తున్న శ్రీహరి వర్గం

స్టేషన్ ఘన్ పూర్ టిఆర్ ఎస్ అఫీషియల్ అభ్యర్థి డాక్టర్ రాజయ్య చెమటలు పడుతున్నాయ్. నియోజవకర్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వర్గం ‘రాజయ్యతో రాజీలేదు’ పొమ్మంటున్నది. ఏమయినా సరే,టికెట్ కడియం కుటుంబానికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దాయన శ్రీహరికి కాకపోతే, కూతురు కావ్యకయినా టికెట్ ఇవ్వాల్సిందే నని అంటున్నారు. అనడమే కాదు, రోడ్డెక్కి రభస చేస్తున్నారు. ఇలా జరుగుతుందని ముఖ్యమంత్రి TRS-105 జాబితా విడుదలచేసిన రోజునే రాజయ్య పసిగట్టాడు. అదే కెసియార్ నిర్ధాక్షిణ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవినుంచితొలగించి అపకీర్తి పాలు చేశకా, డిప్యూటీ సిఎం అయిన శ్రీహరి చాలా హుందాగా రాజకీయాలు నడుపుతూ వచ్చారు.ఎవరూ వెలెత్తి చూపడకుండా జాగ్రత్త పడ్డారు. అంతేకాదు,  పార్టీ నాయకత్వం పట్ల కూడా చాలా విధేయుడిగా ఉన్నారు. ఇది నియోజకవర్గంలో ఆయనకు బాగా పనికొచ్చింది. ప్రాబల్యం పెరిగింది. అనుచరులు పెరిగారు.  నియోజకవర్గంలో అక్షరాల పెద్దాయనగా ఎదిగారు. బహుశాఇదే ఆయనకు ప్రతికూలంగా పనిచేస్తున్నదేమో.

ఇట్లాంటి శ్రీహరి ఆశీస్సులు లేకపోతే, గెలవడం కష్టమని రాజయ్య గ్రహించి, ఆయన బ్లెసింగ్స్ తీసుకునేందుకు ఉప ముఖ్యమంత్రిని కలిశారు. పాదాభివందనం చేశారు. ఇక అంతా సవ్యంగా జరగుతుందని రాజయ్య అనుకున్నారేమో గాని వ్యవహారం అంత సింపుల్ గా లేదని ఇటీవలి పరిణామాలు చెబుతున్నాయి. 

 శ్రీహరిని అసెంబ్లీ కి నిలబెట్టనందుకు అనుచరులు శాంతించేలా లేరు. వారు తిరుగబడుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన  పేరును వ్యతిరేకించేందుకు గట్స్ ఉండాలి.ఎస్, వాళ్లు గట్స్ చూపిస్తున్నారు. కొంతమంది ‘తెలుగురాజ్యం’కు అందించిన  సమాచారం  ప్రకారం, శ్రీహరి అనుచరులు ముఖ్యమంత్రి కెసిఆర్ తీరుపట్ల బాగా అసంతృప్తిగా ఉన్నారు.హోదాలో డిప్యూటీ సిఎం,వ్యక్తిగతంగా సౌమ్యుడు, రాజకీయాల్లో పెద్ద మనషి అయిన శ్రీహరి, నియోజకవర్గం ప్రజల సెంటిమెంట్  గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తే ఆయనతో కలసి విషయం చర్చించేందుకు  కెసిఆర్ సుముఖంగానే లేరు. ఇది వారికి నచ్చ డం లేదు.  అందుకే ఆదివారం నాడు  శ్రీహరి అనుచరులంతా సభ పెట్టి,తమ నాయకుడికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని శ్రీహరి అభిమానులకు నచ్చ చెప్పారు. తనని నామినేట్ చేయకపోతే, కనీసం కూతురు కావ్యనయినా నామినేట్ చేయాలని సూచించాలనుకున్నారు.ఇది జరగలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయనను కలుసుకునేందుకు అంగీకరించేలేదు. శ్రీహరి తీరును ఆయన ధిక్కారంగా చూస్తున్నారు.  అంతేకాదు, రాజయ్యను మార్చే ప్రసక్తే లేదని చెప్పించారు.  ఈ విషయాన్ని కూడా కౌన్సిల్ చీఫ్ విఫ్ పల్లా రాజేశ్వరరెడ్డి ద్వారా చెప్పించారు. స్టేషన్ ఘన్పూర్  నుంచి తాటికొండ రాజయ్యను నిలబెట్టాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం ఫైనల్. ఇది మారదు, అని రాజేశ్వర్ రెడ్డి ఒక మీటింగ్ లో  ప్రకటించారు.

ఈ ప్రకటనలో తనను మార్చరనే ధైర్యం రాజయ్యలో కలిగినా, నియోజకవర్గంలో పరిస్థితి ప్రశాంతంగా లేదని,  శ్రీహరి వర్గం తనకు ఓటేయడం జరగదని రాజయ్య గ్రహించారు. ఆయనకు చెమటలుపట్టిస్తున్న విషయం కూడా అదే.

శ్రీహరి పార్టీ నుంచి వెళ్లి పోతే, సమస్య ఉండదు. అపుడాయన ప్రత్యర్థి అయిపోతాడు.అయితే, పార్టీలోనే ఉంటూ ద్రోహం చేస్తే ఎలా?

TRS official nominee Rajaiah (pic from FB timeline)

ఇపుడు శ్రీహరి వర్గాన్ని ముఖ్యమంత్రి కూడా అదుపు చేయలేని పరిస్థితి. ఫీల్డ్ లో ఏజరుగుతుందో ఎలా అపగలరు. ముఖ్యమంత్రి అండ, శ్రీహరి ఆశీస్సులతో నిమ్మళంగా గెలుస్తాననుకుంటున్నపుడు పరిస్థితి తారుమారయింది. ముఖ్యమంత్రి ,  ఉపముఖ్యమంత్రి మధ్య ఇకసయోధ్య కష్టమని చెబుతున్నారు. శ్రీహరి చేస్తున్న బలసమీకరణంతా ధిక్కార స్వరంగా ముఖ్యమంత్రి భావిస్తున్నారని అంటున్నారు.  నా నిర్ణయానికే ఎదురు చెబుతారా అని కెసిఆర్ ప్రగతి భవన్ లోఅగ్ర హించినట్లు తెలిస్తున్నది. ఈ తిరుగుబాటును ముఖ్యమంత్రి  జీర్ణించుకోలేకపోతున్నారని మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే, అంతే, శ్రీహరి అనుచరులు కూడా అంతే కోపంతో ఉన్నారు.

మొత్తానికి రాజయ్యకు శ్రీహరి వర్గం సహకరించ పరిస్థితే లేదు.  దీనితో ఆయన స్టేషన్ ఘన్ పూర్  టిఆర్ ఎస్ లో పేరున్న లీడర్లందరిని కలసి తనకు సహకరించాలని కోరుతున్నారు.

రాజయ్య వర్సెస్ శ్రీహరి

తెలంగాణాలో తెలుగుదేశం నుంచి రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుకున్న దళితనాయకుల్లో శ్రీహరి ఒకరు. ఆయన చాలా సక్సెస్ ఫుల్  లీడర్.  1994లో టిడిపి తరఫున పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయి ఎన్టీఆర్  ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. తర్వాత 1999 ఎన్నికల్లో గెలుపొంది చంద్రబాబు నాయుడి క్యాబినెట్ లో కూడా మంత్రిఅయ్యారు.2004లో శ్రీహరి, రాజయ్య ఇద్దరు ఓడిపోయారు. టిఆర్ ఎస్ అభ్యర్థి విజయరామారావు గెల్చారు. అయితే, 2009 లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజయ్య గెల్చారు. శ్రీహరి ని ఓడించారు.  అయితే, కెసిఆర్ తెలంగాణా ఉద్యమ పిలుపుతో రాజయ్య సభ్యత్వానికి 2012లో రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో గెలుపొందారు. 2014లో  టిఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయరామారావు( అపుడు కాంగ్రెస్ )ను ఓడించారు. ఈ లోపు 2013లో శ్రీహరి టిడిపికి రాజీనామా చేసి టిఆర్ ఎస్ లో చేరారు.  ఫలితంగా ఆయనను టిఆర్ ఎస్ 2014 లో వరంగల్ లో క్ సభ స్థానానికి నిలబెట్టారు. శ్రీహరి గెల్చారు. ఈ లోపు రాష్ట్రంలో రాజయ్య పరిస్థితి తారుమారయింది. 2014లో డిప్యూటి సిఎం గా నియమితులయినా, ఆయన మీద ముఖ్యమంత్రి కి అసంతృప్తి మొదలయింది.  డిప్యూటీ సిఎం పదవినుంచి బర్త్ రఫ్ చేశారు. ఆ స్థానంలోకి స్టేషన్ ఘన్ పూర్ వదిలి పార్లమెంటురాజకీయాల్లోకి వెళ్లిన శ్రీహరికి మళ్లీ సొంత నియోకవర్గంలో పట్టు దొరికింది. ఉప ముఖ్యమంత్రిగా ఆయన తన రాజకీయ పునాదులు పటిష్టం చేసుకున్నారు. దాని పర్యవసానామే ఇపుడు నియోజకవర్గంలో వచ్చిన రివోల్ట్.