టీఆర్ఎస్ పార్టీ సెల్ఫ్ గోల్.. బీజేపీ తప్పు చేసిందని ఏ విధంగా ప్రూవ్ చేస్తుందో?

మునుగోడు ఉపఎన్నిక సమయంలో బీజేపీ తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని వైరల్ అయిన వార్త సంచలనం సృష్టించింది. అయితే ఈ వ్యవహారంలో చాలా ప్రశ్నలకు సంబంధించిన చిక్కుముడులు ఉన్నాయి. నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని పూర్తిస్థాయిలో ఆధారాలతో ప్రూవ్ చేయడంలో అధికార పార్టీ ఫెయిలైంది.

ఈ వ్యవహారంలో కిషన్ రెడ్డి సంధించిన ప్రశ్నలకు అధికార పార్టీ నేతల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో చూడాల్సి ఉంది. ఈ వ్యవహారంలో పోలీసులకు దొరికిన డబ్బు ఎంత? ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయనే ప్రశ్నలకు తెరాస నుంచి సమాధానం రావాల్సి ఉంది. బీజేపీ ఘాటుగానే కౌంటర్లు ఇస్తుండటంతో బీజేపీ తప్పు చేయలేదనే భావన చాలామందికి కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెరాస పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అధికార పార్టీని కూల్చాలని బీజేపీ భావిస్తే మొదట కాంగ్రెస్ నేతలను చేర్చుకుని ఆ తర్వాత టీ.ఆర్.ఎస్ నేతలపై దృష్టి పెట్టి ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫామ్ హౌస్ లో పట్టుబడ్డవాళ్లు బీజేపీ వాళ్లు కాదని ప్రూవ్ అయితే అప్పుడు కేసీఆర్ సర్కార్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి.

టీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిజంగా బీజేపీలో చేరి ఉంటే ప్రజలే బీజేపీ గురించి తప్పుగా అర్థం చేసుకునేవారు. ఈ మధ్య కాలంలో వరుసగా బీజేపీ నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీ.ఆర్.ఎస్ వార్తల్లో నిలిచింది. టీ.ఆర్.ఎస్ పార్టీదే తప్పు అని తేలితే మునుగోడు ఫలితాలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. టీఆర్.ఎస్, బీజేపీ పార్టీలలో తప్పు ఏ పార్టీదో తెలియడానికి ఎన్నో రోజులు పట్టదని చెప్పవచ్చు.