కొత్త వివాదంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధు (వీడియో)

నిత్యం వివాదాల్లో ఉండే టిఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే పుట్టా మధు మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. మంథని చౌరస్తాలో ఎమ్మెల్యే పుట్టా మధు దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన తెలిపారు. మహిళలను ఉద్దేశించి అవమానపరిచేలా పుట్టా మధు మాట్లాడినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అంతేకాదు ఆయన మీద పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు కూడా ఫైల్ అయింది. పూర్తి వివరాలు, చదవండి. వీడియో ఉంది చూడండి.

టిఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ తన ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎసి గదుల్లో కలెక్టరమ్మతో సరసాలు ఆడుతున్నారంటూ కామెంట్ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మంథనిలో ఆయన చేసిన కామెంట్స్ మహిళలను కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఒక మహిళా కలెక్టర్ గురించి నీచంగా మాట్లటాడారని ఆరోపించారు. దిష్టిబొమ్మ కాల్చడమే కాకుండా పోలీసు స్టేషన్ లో మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలంటూ ఫిర్యాదు చేశారు. 

పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తానికి మరో వివాదంలో పుట్టా మధు చిక్కుకుపోవడం ఉత్తర తెలంగాణలో చర్చనీయాంశమైంది.  కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీ కింద ఉన్నాయి చూడండి.