కొడంగల్ లో నోరు జారిన టిఆర్ఎస్ అభ్యర్థి (వీడియోలు)

ఎన్నికలు సమీపిస్తున్నవేళ టిఆర్ఎస్ అభ్యర్థులు నోటికి పని చెప్పుతున్నారు. ఎంతగా అంటే నోటికి ఎంత మాటొస్తే అంతమాట మాట్లాడుతున్నారు. బూతులకు తెగబడుతున్నారు. గ్రామాల్లో తిరుగుతున్న సమయంలో ఎవరైనా వచ్చి ఏ ప్రశ్న అడిగినా, నిలదీసినా శివాలెత్తిపోతున్నారు. ముత్క కూతలు కూస్తున్నారు. తాజాగా టిఆర్ఎస్ కొడంగల్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి తన పర్యటనలో అడ్డు తగిలిన విద్యార్థులను బూతు కూతలు కూశారు. ఆయన ఏమాటలు తిట్టిండో కింద చిన్న వీడియో లో చూడండి.

మొన్నటికి మొన్న నారాయణ్ ఖేడ్ టిఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి తమకు ప్రభుత్వ పథకాలు రావడంలేదు సారూ.. అన్నందుకు అరేయ్ లం… కొడకా అని గలీజు మాట అన్నారు. దాంతో గ్రామస్తులంతా ఏకమై ఆయనను ఊరి పొలిమేరలు దాటించారు. మల్లా ఆగ్రామంలో అడుగు పెట్టాలంటేనే భూపాల్ రెడ్డికి భయం కలిగేలా యూత్ తగిన గుణపాఠం చెప్పారు.

తాజాగా కొండగల్ నియోజకవర్గంలోని గోకఫసల్ వాద్ గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన యాత్రను కొడంగల్ కు చెందిన ఓయు విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు ఉద్యోగాలే ఇవ్వకుండా మాటలు చెబుతున్నరా అని స్టూడెంట్స్ నిలదీసే ప్రయత్నం చేశారు. 

నిజానికి కొడంగల్ లో పాగా వేసేందుకు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి రాత్రింబవళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. బలం, బలగం పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కొండగల్ నియోజకవర్గంలో రేవంత్ ఫాలోయింగ్ ముందు ఆయన నిలబడలేకపోతున్నారు. టిఆర్ఎస్ లో వర్గాల మధ్య సమన్వయం కోసం బాగానే కష్టపడుతున్నా.. కొడంగల్ అంటే రేవంత్, రేవంత్ అంటే కొడంగల్ అనే సెంటిమెంట్ ను విడదీయడంలో నరేందర్ రెడ్డి విజయవంతం కాలేకపోతున్నారు. 

పట్నం నరేందర్ రెడ్డిని నిలదేసిన వారిలో ఓయు జెఎసి నేత రెడ్డి శ్రీనివాస్, ఆయన స్నేహితులు ఉన్నారు. దీంతో వారి నిరసనను తట్టుకోలేకపోయారు పట్నం నరేందర్ రెడ్డి. పట్టరాని కోపంతో వారిపై బూతు కూతలకు దిగారు. తన్నండి లం… కొడుకులను అంటూ వారిపై విరుచుకుపడ్డారు. గ్రామాల్లో పనులు చేయడం చేతగాని కొడుకులు అంటూ విరుచుకుపడ్డారు.

ఇక మరో విషయం ఏమంటే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినంత సేపు కనీసం అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఆయన స్పీచ్ ను ఫాలోకాలేదు. ఆవిషయం వీడియోలో క్లారిటీ గా ఉంది. ఆయన ఏమన్నారో కింద ఫుల్ వీడియో ఉంది చూడండి.

 

TRS kodangal 2